Home /News /telangana /

ఓర్నీ.. ఇతడు చెప్పిన మాయమాటలు నిజమని నమ్మి రూ.1.6 కోట్లు ఇచ్చిన నిరుద్యోగులు.. తీరా చూస్తే..

ఓర్నీ.. ఇతడు చెప్పిన మాయమాటలు నిజమని నమ్మి రూ.1.6 కోట్లు ఇచ్చిన నిరుద్యోగులు.. తీరా చూస్తే..

మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పోస్టాఫీస్, LIC పథకాలు

మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పోస్టాఫీస్, LIC పథకాలు

నిరుద్యోగులు ఇంకా మోసపోతూనే ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారి మాటలను నమ్మి లక్షలకు లక్షలు ముట్టజెప్పుతున్నారు. తీరా అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది..

    రైల్వే శాఖకు సంబంధించిన వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే ఓ అలెర్ట్ కనిపిస్తుంది. ’రైల్వే ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పేవాళ్లను నమ్మకండి. వారికి డబ్బులు ఇచ్చి మోసపోకండి. అలాంటి వారిపై వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే రైల్వే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది‘ అని ఓ మెసెస్ రైల్వే వెబ్ సైట్లలో స్క్రోల్ అవుతూ ఉంటుంది. అయినా సరే నిరుద్యోగులు ఇంకా మోసపోతూనే ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారి మాటలను నమ్మి లక్షలకు లక్షలు ముట్టజెప్పుతున్నారు. తీరా అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 25 మంది నిరుద్యోగులను ఓ కేటుగాడు మోసం చేశాడు. వారి నుంచి ఏకంగా ఒక కోటీ 60 లక్షల రూపాయలను కొల్లగొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కర్నూలుకు చెందిన పీ ఖాజా అనే 46 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్ లో కొందరితో ఓ ముఠాను ఏర్పరచుకున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆ ముఠా నిరుద్యోగులకు వల వేస్తుంటుంది. హైదరాబాద్ లో ఉద్యోగావకాశాల కోసం వచ్చిన నిరుద్యోగులను పీ ఖాజా టార్గెట్ చేసుకున్నాడు. రైల్వే ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. రైల్వే శాఖలో కుప్పలు తెప్పలుగా గ్రూప్ డీ ఉద్యోగాలు ఉన్నాయనీ, తనకు బడా బడా నేతలు తెలుసుననీ నిరుద్యోగులతో నమ్మబలికాడు. 25 మంది నిరుద్యోగులు ఇతగాడి వలలో పడ్డారు. ఆ నిరుద్యోగులు ఒక్కొక్కరు ఆరేడు లక్షలు అతడికి సమర్పించారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో కలకలం.. పార్టీకి వెళ్తున్నానని చెప్పి అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ లో ఆ మెడికల్ విద్యార్థి..

    మొత్తంగా ఆ 25 మంది నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.1.6 కోట్ల రూపాయలను కొల్లగొట్టగలిగాడు. డబ్బులు తీసుకుని ఎన్నాళ్లయినా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో నిరుద్యోగులకు అనుమానం వచ్చింది. అతడికి ఫోన్లు చేసినా కలవలేదు. అతడిని నేరుగా కలిసి నిలదీద్దామనుకున్నారు. కానీ అతడు గతంలో కలిసిన ప్రాంతంలో లేడనీ, ఫోన్ నెంబర్లు కూడా పనిచేయడం లేదని వారికి ఆలస్యంగా తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖాజాను అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
    ఇది కూడా చదవండి: పెళ్లి మండపం నుంచి వరుడు ఎస్కేప్.. వధువు చేసిన పనికి అంతా షాక్.. పెళ్లి బట్టల్లో ఉండే..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Hyderabad, Indian Railway, Railway employees

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు