హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad suicide : నిరుద్యోగి ఆత్మహత్య.. సీఎం కేసీఆర్‌కు లేఖ..

Adilabad suicide : నిరుద్యోగి ఆత్మహత్య.. సీఎం కేసీఆర్‌కు లేఖ..

Adilabad suicide : నిరుద్యోగి ఆత్మహత్య.. సీఎం కేసీఆర్‌కు లేఖ..

Adilabad suicide : నిరుద్యోగి ఆత్మహత్య.. సీఎం కేసీఆర్‌కు లేఖ..

Adilabad suicide : ఉద్యోగం రావడం లేదని ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్‌లో వెలుగు చూసింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన యువకుడు అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.

ఉద్యోగ ప్రకటనలు వెలువడకపోవడంతో ఇక ఉద్యోగం రాదేమోనని మనస్థాపం చెంది ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరు చెలుక గ్రామంలో చోటుచేసుకుంది. ఇప్పటికైనా ఉద్యోగ ప్రకటన ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రాతినిధ్యంవహిస్తున్న చెన్నూరు శాసనసభ నియోగకవర్గం పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే,

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ని కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ చేసిన మహేష్ కొన్నాళ్లు గా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా ఫలితం లేక పోవడం తో మనస్తాపానికి లోనయ్యారు. ఇక ఉద్యోగం రాదన్న బెంగతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశాడు. విషయం తెలుసుకున్న అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు.

ఇది చదవండి : తెలంగాణలో తొలిసారి.. ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోబోతున్నారు.. వివరాల్లోకి వెళ్తే..


నిరుద్యోగి ఆత్మహత్య విషయం బయటకు పొక్కకుండా విశ్వప్రయత్నాలు చేశారు. పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించారు. వైద్య సిబ్బంది ని అక్కడికే పిలిచి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్ బాడీ ని తీసుకుని ఆస్పత్రికి వెళ్లినా గంటల తరబడి జాప్యం చేసే వైద్యులు, పోలీసులు గంటల్లోనే నిరుద్యోగి గ్రామానికి వెళ్లి మొత్తం తతంగాన్ని పూర్తి చేయడం చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగి ఆత్మహత్య విషయం బయటకు పొక్కితే ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనన్నఉద్దేశ్యంతో గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. కాని ఈ వార్త దావానంలా వ్యాపించింది.

 ఇది చవదండి : భూ కంపం.. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రకంపనలు.. !

First published:

Tags: Adilabad, Suicide

ఉత్తమ కథలు