Home /News /telangana /

UNEMPLOYED PEOPLE IN MAHBUBNAGAR DISTRICT ARE GETTING CHEATED BY CYBER CRIMINALS POLICE ALERTED MBNR PRV

Cyber crimes: ఆశ చూపి టోకరా.. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు లాగుతున్న సైబర్ నేరగాళ్లు

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఉమ్మడి పాలమూరు (Mahbubnagar) జిల్లా వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో సైబర్ (Cyber) నిరగాళ్లు ఉచ్చులో పడి డబ్బులు కోల్పోతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి.

    (Sayyad Rafi, News18, Mahbubanagar)

    ఉమ్మడి పాలమూరు (Mahbubnagar) జిల్లా వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో సైబర్ (Cyber) నిరగాళ్లు ఉచ్చులో పడి డబ్బులు కోల్పోతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలను అధిగమించేందుకు కొందరు ఇంట్లోనే ఉండి సంపాదించాలన్న భావనతో పార్ట్ టైం ఉద్యోగం చేద్దామని అంతర్జాలంలో వెతుకుతున్నారు. ఇది అదునుగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) విజృంభిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్ల ద్వారా నిండా ముంచుతున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది నిరుద్యోగులు విద్యార్థులు యువత మహిళలు మాయదారి యాప్ల వల్ల చిక్కి నష్టపోతున్నారు. నెలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 150 వరకు సైబర్ కేసులు నమోదవుతున్నాయి. ఏడాదికి దాదాపు 200 మంది మోసపోతున్నారు

    24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తేనే ఫలితం..

    సైబర్ నేరాలపై పోలీస్ శాఖ కళాజాత బృందాల ద్వారా విద్యార్థులకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలో కళాశాలలో గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సక్రమంగా వివరిస్తున్నారు.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన బ్యాంక్ క్లర్క్​గా పనిచేస్తున్న యువతి సెల్ ఫోన్ కి పార్ట్ టైం జాబ్ పేరిట సంక్షిప్త సమాచారం రావడంతో స్పందించింది. టాస్క్ పూర్తి చేయగా లాభం వచ్చింది. సైబర్ నేరగాళ్ల ఆన్ లైన్ లో ఆమె పేరిట ఫేక్ ఖాతా సృష్టించి డబ్బులు జమ చేస్తున్నట్లు నమ్మించారు. నిత్య మా ఖాతాలో డబ్బులు చూసుకుంటూ పెట్టుబడి పెట్టగా రూ.1.46.114 తన అకౌంట్​ నుంచి పోయాయి. దీంతో మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.



    మహబూబ్​నగర్ ఎస్వీఎస్ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని పేద కుటుంబం కావడంతో చదువుకుంటూనే పార్ట్ జాబ్ చేయాలనుకుంది. అంతర్జాలంలో పార్ట్ టైం జాబ్ ప్రకటనకు స్పందించింది. రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్ రుసుము పేరిట రూ. 12.980.. సైబర్ నీరగాళ్ల తీసుకున్నారు. తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    24 గంటల్లోగా ఫిర్యాదు చేస్తేనే..

    చాలామంది స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తుండడంతో సైబర్ నేరగాళ్ల దొంగ ఐడీల నుంచి ఉద్యోగ ప్రకటనలతో ఆకట్టుకుంటున్నారు. ఇంట్లో ఉండే సంపాదన చేసుకోవచ్చు అని సందేశాలకు స్పందిస్తే అంతే సంగతులు మోసం జరిగినా వెంటనే డయల్ 100 లేదా 1930కు ఫిర్యాదు చేయాలి. అనుమానాస్పదంగా వచ్చే మెసేజ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. ఒకవేళ టచ్ చేసి నష్టపోతే 24 గంటల లోపు పోలీసులకు ఆశ్రయిస్తేనే పోగొట్టుకున్న డబ్బులు వెనక్కి వచ్చా అవకాశం ఉంటుందని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన పలువురు సైబర్ నిపుణులు సాంకేతిక పరిజ్ఞానంతో సులువుగా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని జాప్య మైతే సైబర్ నేరగాళ్ల తప్పించుకునే అవకాశం ఎక్కువ అని చెబుతున్నారు పోలీసులు.

    వందలు ఆశ చూపి లక్షలు ఫట్​..

    మరో కేసులో మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని మైత్రి నగర్ కు చెందిన యువతీ డిగ్రీ పూర్తి చేశారు. ఇంట్లో ఉండి పార్ట్ టైం జాబ్ చేసేందుకు అంతర్జాలంలో అన్వేషించగా ఓ కంపెనీ యాడ్ ఆకట్టుకుంది. దానిని క్లిక్ చేసి అందులో ఉన్న టాస్కులను పూర్తి చేసింది. మొదట రూ 200 పెట్టుబడిగా పెట్టగా సైబర్ నేరగాళ్లు రూ 350 పంపారు. తరువాత రూ 500 కు రూ 800 ఇచ్చి నమ్మించారు. డబ్బులు జమ చేయడానికి ఖాతా నెంబర్ ఓటిపి తదితర వివరాలను చెప్పాలని సైబర్ నెరగాళ్లు సూచించారు. యువతి తన తల్లి ఖాత వివరాలు ఓటిపి వివరాలు చెప్పడంతో రూమ్ మూడు లక్షలు కాజేశారు. మోసం గుర్తించిన బాధ్యత యువతి పోలీసులను ఆశ్రయించింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cheated, CYBER CRIME, Mahbubnagar, Police, Unemployees

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు