దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిల భర్తీ విషయంలో జరుమీదున్న సుప్రీకోర్టు కొలీజయం మరికొన్ని కీలక మార్పులు చేసింది. మొత్తం ఆరు హైకోర్టులకు కొత్త సీజేలను నియమించింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయాన్‌కు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా తెలంగాణ సీజేగా వ్యవహరించిన జస్టిస్ సతీశ్రచంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేసింది. పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు కొత్త సీజే రావడం వరుసగా ఇది రెండోసారి.
గతంలో సతీష్ చంద్రశర్మ కర్ణాటక హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు 2008 జనవరి 18న అదనపు న్యాయమూర్తిగా అపాయింట్ అయిన ఆయన జనవరి 15, 2010న పర్మిమెంట్ జడ్జి అయ్యారు. 2021 అక్టోబర్‌లో తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా ఎలివేట్ అయ్యారు. తాజా మార్పుల్లో సుప్రీం కోలీజయం ఆయనను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించింది. ఇక, తాజాగా చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలంగాణ హైకోర్టులోనే న్యాయమూర్తిగా ఉన్నారు.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అక్టోబర్ 17, 2011న ఉజ్జల్ గౌహతి హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా అపాయింట్ అయ్యారు. 03.10.2019న బాంబే హైకోర్టుకు ఆయన బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్ లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు అందుకున్నారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యవహరిస్తున్నారు. టీఎస్ హైకోర్టు నూతన సీజే ప్రమాణస్వీకార తేదీ ఇంకా వెల్లడికాలేదు. కాగా,
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తోపాటు తాజాగా మొత్తం ఐదుగురు జడ్జిలకు హైకోర్టు సీజేలుగా ఎలివేషన్ లభించింది. 1)తెలంగాణ హైకోర్టులోనే పనిచేస్తున్న ఉజ్జల్ ఇక్కడే సీజేగా నియమితులుకాగా, 2)ఢిల్లీ హైకోర్టు జడ్జి విపిన్ సంఘీకి ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా, 3)బాంబే హైకోర్టు జడ్జి అహ్మద్ ఎ సయీద్ ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా, 4)బాంబే హైకోర్టు జడ్జి ఎస్ఎస్ షిండేను రాజస్థాన్ హైకోర్టు సీజేగా, 5)గుజరాత్ హైకోర్టు జడ్జి రష్మిమ్ ఛాయను గువాహటి(అస్సాం) చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.