హైదరాబాదీకి ఆధార్ సంస్థ షాక్.. పౌరసత్వం నిరూపించుకోవాల్సిందే..

ఫిబ్రవరి 3న సత్తర్ ఖాన్‌కు ఆధార్ సంస్థ UIDIA నుంచి నోటీసులు వచ్చాయి. నువ్వు భారత పౌరుడివి కాదని.. నకిలీ ధృవపత్రాలను సృష్టించి ఆధార్ కార్డ్ తీసుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: February 18, 2020, 6:59 PM IST
హైదరాబాదీకి ఆధార్ సంస్థ షాక్.. పౌరసత్వం నిరూపించుకోవాల్సిందే..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగుతున్న వేళ.. ఓ హైదరాబాదీకి విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (UIDIA) షాకిచ్చింది. నకిలీ భారత పౌరసత్వం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ అతడికి నోటీసులు జారీచేసింది. భారత పౌరుడని నిరూపించుకునేందుకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సత్తర్ ఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. హైదరాబాద్ అడ్రస్‌తో అతడికి ఆధార్ కార్డు కూడా ఉంది.

ఈ క్రమంలో ఫిబ్రవరి 3న సత్తర్ ఖాన్‌కు ఆధార్ సంస్థ UIDIA నుంచి నోటీసులు వచ్చాయి. నువ్వు భారత పౌరుడివి కాదని.. నకిలీ ధృవపత్రాలను సృష్టించి ఆధార్ కార్డ్ తీసుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 20న రంగారెడ్డిలోని బాలాపూర్‌లో ఎంక్వైరీ ఆఫీసర్ ఎదుట హాజరై అన్ని ఒరిజినల్ ధృవపత్రాలను చూపించాలని ఆదేశించింది. ఒకవేళ భారత పౌరుడివి కాకుంటే.. దేశంలోకి చట్టబద్ధంగా ప్రవేశించినట్లుగా నిరూపించుకోవాల్సి ఉంటుందని UIDIA తేల్చిచెప్పింది. ఒకవేళ విచారణ రాకుంటే సుమోటాగా తాము నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది.

ఐతే UIDIA పంపిన నోటీసులపై సత్తర్ ఖాన్ లాయర్ ముజఫరుల్లా ఖాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత పౌరులకు సమన్లు జారీచేసే అధికారం, పౌరసత్వాన్ని ప్రశ్నించే అధికారం UIDIAకు లేదని విమర్శించారు. ఆధార్ సంస్థ నోటీసులపై హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. సత్తర్ ఖాన్‌తో నగరంలో పలువురికి ఇలాగే నోటీసులు పంపించారని ఆయన తెలిపారు. వారిని విచారించేందుకు ఫంక్షన్ హాల్‌‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ఐతే సత్తర్ ఖాన్‌పై ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలను మాత్రం UIDIA బహిర్గతం చేయలేదు..

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు