Home /News /telangana /

UGADI PANCHANGAM AND SRIRAMA NAVAMI CELEBRATIONS WILL BE ONLINE IN TELANGANA BA

కరోనా ఎఫెక్ట్.. లైవ్‌లో ఉగాది పంచాంగం... ఆన్‌లైన్‌లో రాములోరి తలంబ్రాలు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

‘ఈ నెల 25న దేవాదాయ శాఖ కార్యాల‌యంలో పంచాంగ శ్ర‌వ‌ణం ఉంటుంది. లైవ్ టెలికాస్ట్ ద్వారానే పంచాంగ శ్ర‌వ‌ణం, శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను వీక్షించాలి.’ అని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.

    కరోనా వైరస్ ఎఫెక్ట్ సాధారణ ప్రజల మీదే కాదు, దేవుళ్ల మీద కూడా పడింది. తెలంగాణలో ఈ ఏడాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. సాధారణంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పెద్ద ఎత్తున అతిథులను పిలిచి ప్రభుత్వం తరఫున పంచాంగ శ్రవణం చేస్తారు. అయితే, ఈ సారి అలాంటి భారీ కార్యక్రమాలు పెట్టుకోకుండా, కేవలం లైవ్ టెలికాస్ట్ ద్వారా మాత్రమే పంచాంగ శ్రవణం చేయనున్నారు. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో శ్రీరాముని కళ్యాణానికి కూడా భక్తులకు అనుమతి లేదు. అలాగే, గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించే రాములోరి కల్యాణాలను కూడా ప్రజలు రద్దు చేసుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.

    ‘ఈ నెల 25న దేవాదాయ శాఖ కార్యాల‌యంలో పంచాంగ శ్ర‌వ‌ణం ఉంటుంది. లైవ్ టెలికాస్ట్ ద్వారానే పంచాంగ శ్ర‌వ‌ణం, శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను వీక్షించాలి. భ‌ద్రాద్రి ఆల‌యంలోప‌లే శ్రీసీతారాముల క‌ళ్యాణోత్స‌వం నిర్వహిస్తాం. భ‌క్తులెవ‌రికీ అనుమ‌తి లేదు. ప్ర‌భుత్వం త‌ర‌పున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు, త‌లంబ్రాలు స‌మ‌ర్పిస్తాం.
    బ‌హిరంగ ప్ర‌దేశాల్లో శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు నిర్వ‌హించ‌వ‌ద్దు. ప్ర‌జ‌లు ఇంట్లో ఉండే పండ‌గ‌లు నిర్వ‌హించుకోవాలి. ఆన్ లైన్ లో రాములోరి త‌లంబ్రాలు అందుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆల‌యాల్లో ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేసాం. భ‌క్తులు ద‌ర్శ‌నాల కోసం ఆల‌యాలకు రావ‌ద్దు.’ అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Sri rama navami 2020, Telangana, Ugadi 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు