Home /News /telangana /

TWO YOUTH ARRESTED BY POLICE OVER THEY TRYING TO SHIFT SUSPECTED DEAD BODY IN HAYATH NAGAR VB

Crime News: హయత్ నగర్ లో దారుణం.. భార్య శవాన్ని దుప్పటిలో చుట్టి.. చివరకు..

శవాన్ని తీసుకెళ్తున్నవ్యక్తి

శవాన్ని తీసుకెళ్తున్నవ్యక్తి

Hyderabad Crime: హైదరాబాద్ లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా చెరువలో పడేయడానికి ఓ వ్యక్తి ప్లాన్ చేశాడు. ఒక చెద్దరు లో చుట్టి తీసుకెళ్తుండగా గ్రామస్తులు అతడికి ఆపి.. అడిగారు. పొంతన లేని సమాధానం చెబుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    హైదరాబాద్(Hyderabad) లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా చెరువులో పడేయడానికి ఓ వ్యక్తి ప్లాన్ చేశాడు. ఒక చెద్దరు లో చుట్టి తీసుకెళ్తుండగా గ్రామస్తులు అతడిని ఆపి.. అడిగారు. పొంతన లేని సమాధానం చెబుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు వచ్చి ప్రశ్నించడంతో ఆమె తన భార్య(Wife) అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె చనిపోయిందని అతడు చెబుతున్నాడు. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో చోటు చేసుకుంది.

    అతడి వద్ద సెక్రటరీగా ఆమె పని చేస్తుంది.. పని ఉందంటూ ప్లాట్ కు రప్పించుకున్నాడు యజమాని.. చివరకు ఇలా జరిగింది..


    ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు ఇలా తెలిపారు. హైదరాబాద్ నగర శివారులోని హయత్ నగర్ లో ఓ వ్యక్తి రోడ్డు పక్కన భుజాన ఓ బరువును మోసుకుంటూ వెళ్తున్నాడు. అతడి పక్కన మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వారు వెళ్తున్న క్రమంలో అక్కడే ఉన్న స్థానికులకు అనుమానం వచ్చింది. అతడి భుజాన ఉన్నది ఒక మృతదేహంగా గ్రహించారు. వాళ్లు వాళ్లిద్దరిని ఆపి.. అదేంటి.. అంటూ ప్రశ్నించారు. కిందకు దించి అందులో మహిళా మృతదేహం చూసి షాక్ అయ్యారు. ఆమెను హత్య చేసి తీసుకెళ్తున్నారని అనుమానించారు స్థానికులు. వాళ్లను అక్కడ నుంచి పారిపోకుండా పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Hyderabad Crime: భార్య చనిపోవడంతో ఇంట్లో తండ్రి, కూతురు ఉంటున్నారు.. 15 రోజుల నుంచి కన్న కూతురుపై అతడు..


    ఈ లోపు వాళ్లను ఈ శవం ఎవరిదీ.. ఎక్కడకు తీసుకెళ్తున్నారంటూ అడిగారు. మృతదేహంపై దుస్తులు లేకపోవడం, పొంతన లేని సమాధానం చెప్పడంతో యువకులిద్దరినీ స్థానికులు చితకబాదారు. తొర్రూరు రోడ్డులో ఉన్న బాతుల చెరువు సమీపంలో మహిళ మృతదేహాన్ని బ్లాంకెట్‌లో చుట్టి బాతుల చెరువులో పడేసేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించారు. ఏం జరిగిందని ప్రశ్నించగా.. శ్రీను అనే యువకుడు.. తమది ప్రేమ వివాహం అని, ఆమె తన భార్య అని చెప్పుకొచ్చారు.

    Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. దుకాణం షెట్టర్‎లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం..


    తన భార్య అనారోగ్యంతో మృతిచెందిందని, దహణ సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని పడేసేందుకు తీసుకెళ్తున్నానని నిందితుడు శ్రీను చెప్పారు. అయితే వారిపై అనుమానం వీడకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళ శరీరంపై దుస్తులు కూడా లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. మహిళ భర్త శ్రీనుతో పాటు వినోద్ అనే యువకుడిని కూడా పోలీసులు అరెస్టు చేవారు. అనారోగ్యమా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు