TWO YOUNG MEN WEARING MASKS APPROACHED A MINOR GIRL STABBED HER AND FLED IN YADADRI BK PRV
Yadadri: యాదాద్రిలో దారుణం.. మాస్కు ధరించి బాలిక దగ్గరికొచ్చి గొంతకోసి పరారైన యువకులు..
ప్రతీకాత్మక చిత్రం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దత్తప్పగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి, గొంతుకోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన యువతిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు
యాదాద్రి (Yadadri) జిల్లా మోత్కూర్ మండలం దత్తప్పగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతి (Minor girl)పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి గొంతుకోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన యువతిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దత్తప్పగూడెం గ్రామానికి చెందిన యువతి ఎలుగు యమున (17) వలిగొండ మండలం లోతుకుంట గ్రామంలోని మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న యమున పై బైక్ పై మాస్క్ ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు (Two persons) దాడిచేశారు. యువతిని గోడకు కొట్టి కత్తితో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు (stabbed her and fled) .
గొంతు కోయడంతో కేకలు, అరుపులు విని ఇరుగు పొరుగు వారు వచ్చి యువతిని చికిత్స కోసం హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. యువతిపై దాడి ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న మోత్కూర్ ఎస్సై వి. జానకి రామ్ రెడ్డి సిబ్బందితో దత్తప్పగూడెం చేరుకున్నారు.
అనంతరం రామన్నపేట సిఐ మోతీరాం కూడా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. యువతిపై దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాస్క్ ధరించి రావడంతో ఇద్దరు వ్యక్తులు తెలిసిన వారై ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో..
ఇటీవల ఏపీలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని కాలేజీమిట్టకు చెందిన బాలిక (17) ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ చెంచు కృష్ణ ప్రేమ పేరుతో ఆమెను కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు యువకుడిని మందలించారు కూడా. వాడి జీవితం పాడైపోతుందనే చిన్న సంశయంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మందలింపుతో వదిలేయడమే ఇప్పుడు ఘోరానికి దారితీసినట్లయింది.నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని కాలేజీమిట్టకు చెందిన బాలిక (17) ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ చెంచు కృష్ణ ప్రేమ పేరుతో ఆమెను కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు యువకుడిని మందలించారు కూడా. వాడి జీవితం పాడైపోతుందనే చిన్న సంశయంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మందలింపుతో వదిలేయడమే ఇప్పుడు ఘోరానికి దారితీసినట్లయింది.
ప్రేమించడంలేదని, వెంటపడుతోన్న విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పిందని బాలికపై కోపం పెంచుకున్న చెంచుకృష్ణ.. సోమవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న బాలికను గమనించాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదే అదనుగా కత్తితో లోపలికి చొరబడి బాలిక గొంతు కోశాడు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.