హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sangareddy: గురువు గారూ అంటూనే గట్టి దెబ్బేశారు.. మద్యం మత్తులో ముంచెత్తి.. మొత్తం దోచేశారు..

Sangareddy: గురువు గారూ అంటూనే గట్టి దెబ్బేశారు.. మద్యం మత్తులో ముంచెత్తి.. మొత్తం దోచేశారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లక్ష్మీనారాయణను ఆ యువకులు కావాలనే మద్యంలో ముంచెత్తారు. మళ్లీ మందు తీసుకొస్తామని చెప్పి ఆయన బైక్‌నే తీసుకెళ్లారు. ఎందుకంటే.. బైక్ తాళానికే ఇంటి తాళం చెవులు కూడా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ''గురువు గారూ.. గుర్తుపట్టారా? మేమం మీ శిష్యులం..!'' అంటూ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి దగ్గరైన ఇద్దరు యువకులు.. ఆయన్ను నిండా ముంచేశారు. సర్వం దోచేశారు. పీకలదాకా మద్యం తాగించి.. ఆ తర్వాత డబ్బు నగలతో పారిపోయారు. సంగారెడ్డి  (Sangareddy) జిల్లా జోగిపేట టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి ఓ గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు. రిటైర్ అయ్యాక.. ఎస్సీ బాలుర హాస్టల్స్ ప్రాంతంలో ఉన్న ఓ అద్దె గదిలో ఒంటరిగా ఉటున్నారు. ఈయనకు మద్యం తాగే అలవాటుంది. రెండు నెలల క్రింత మార్కెట్ యార్డ్ ఆవరణలో మద్యం సేవిస్తుండగా ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. 'సార్.. బాగున్నారా? మమ్మల్ని గుర్తుపట్టారా? మీ స్కూల్‌లోనే మేం చదువుకున్నాం..' అని పరిచయం చేసుకున్నారు. ఎంతో అప్యాయంగా పలకరించడంతో వారు నిజంగానే తన విద్యార్థులేమోనని ఆయన అనుకున్నారు. అలా మొదలైన పరిచయం.. ఆ తర్వాత ముగ్గురూ కలిసి మద్యం సేవించేంత వరకు వెళ్లింది. అప్పుడప్పుడూ కలుసుకొని మద్యం తాగడంతో.. వారితో లక్ష్మీనారాయణకు చనువు మరింత పెరిగింది.

  ఎప్పటిలాగే సెప్టెంబరు 24న కూడా ఆ ఇద్దరు యువకులు లక్ష్మీనారాయణను కలిశారు. మార్కెట్ యార్డ్ వద్ద మద్యం తాగాలని అనుకున్నారు. కానీ అక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి.. అన్నాసాగర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ కలిసి మద్యం తాగారు. ఐతే లక్ష్మీనారాయణకు ఉద్దేశ్యపూర్వకంగానే ఎక్కువ మద్యం పోశారు. పీకలదాకా మందు తాగించారు. ఇంకా మద్యం తీసుకొస్తామని చెప్పి.. ఆయన బైక్‌ను తీసుకెళ్లారు. కానీ ఎంత సేపయినా తిరిగి రాలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో వెళ్లిన యువకులు రాత్రి 8 అవుతున్నా రాలేదు. దాంతో లక్ష్మీనారాయణ పక్కనే ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయంలో నిద్రలేచి తన ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఇంటికి తాళం లేదు. బయటి నుంచి గడియ మాత్రమే పెట్టి ఉంది. అనుమానంతో లోపలికి వెళ్లి చూశాడు. బీరువా తాళం పగులకొట్టి ఉంది. అందులో ఉన్న డబ్బు 30 లక్షల నగదు, 10 తులాల బంగారం మాయమైంది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  ఇలా చోరీ చేశారు.?

  లక్ష్మీనారాయణను ఆ యువకులు కావాలనే మద్యంలో ముంచెత్తారు. మళ్లీ మందు తీసుకొస్తామని చెప్పి ఆయన బైక్‌నే తీసుకెళ్లారు. ఎందుకంటే.. బైక్ తాళానికే ఇంటి తాళం చెవులు కూడా ఉన్నాయి. ఆ విషయం వారికి ముందే తెలుసు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారమే విద్యా సాగర్ బైక్‌ని తీసుకెళ్లారు. అన్నాసాగర్ వద్ద లిక్కర్ కోసం ఆయన ఎదురుచూస్తున్న సమయంలో.. వీరిద్దరు ఇంటికి వెళ్లి.. చోరీ చేశారు. బీరువాను పగులకొట్టి.. ఉన్న డబ్బుతో పాటు బంగారాన్ని కాజేశారు. రిటైర్‌మెంట్‌ ద్వారా వచ్చిన డబ్బులతో ఇంటి స్థలం కొందామనుకున్నానని.. అంతలోనే చోరీ అయిందని లక్ష్మీనారాయణ వాపోయారు. రెండు నెలల క్రితం పరిచయమైన యువకులే ఈ పని చేశారని చెప్పారు. ఐతే ఆ యువకులు పేర్లు మార్చి చెప్పి ఉండవచ్చని.. తమది సంగారెడ్డి అని చెప్పారని పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Robbery, Telangana

  ఉత్తమ కథలు