• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TWO WOMEN DEAD BODIES FOUND AT HOUSE IN NIRMAL DISTRICT VS ADB

Death : తల్లీ, కూతుళ్ల మరణం.. మధ్యలో మతిలేని కొడుకు .. 8 రోజులుగా ఇంట్లో శవాలు...

Death : తల్లీ, కూతుళ్ల మరణం.. మధ్యలో మతిలేని కొడుకు .. 8 రోజులుగా ఇంట్లో శవాలు...

తల్లీ, కూతుళ్ల మరణం

death : ఇద్దరు మహిళలు ఎలా చనిపోయారో తెలియదు..చనిపోయి ఎనిమిది రోజులు అవుతున్నా ఎవ్వరు గుర్తించని పరిస్థితి..విషాదం ఏమిటంటే..రెండు మృతదేహాల మధ్య ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కూడ ఉండడం గమనార్హం.

  • Share this:
ఇద్దరు మహిళలు ఎలా చనిపోయారో తెలియదు..చనిపోయి ఎనిమిది రోజులు అవుతున్నా ఎవ్వరు గుర్తించని పరిస్థితి..విషాదం ఏమిటంటే..రెండు మృతదేహాల మధ్య ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కూడ ఉండడం గమనార్హం..ఇంత జరుగుతున్నా ఆ గ్రామస్థులకు మాత్రం ఏమి తెలియని పరిస్థితి..అయితే ఇద్దరు మహిళలు చనిపోయిన తర్వాత ఎనిమిది రోజులకు ఇంటినుండి దుర్వాసన వస్తుంటే గ్రామస్లులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా, ముథోల్ మండలంలోని రాంటేక్ గ్రామాంలో ఈ సంఘటన   చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు తల్లీ కూతుళ్లు లక్ష్మి , భారతీబాయిలు గ్రామంలో  నివసిస్తున్నారు. భారతీభాయికి అయిదు కుమారులు ఓ కూతురు ఉన్నట్టు చెబుతున్నారు. అయిదుగురు కొడుకుల్లో ఓ కుమారుడు చనిపోయినట్టుగా చెబుతున్నారు. మిగతావారు అంతా బయట జీవిస్తుండగా..మరో కుమారుడికి మతిస్థిమితం లేకుండా తల్లితోనే జీవిస్తున్నాడు. కాగా మతిస్థిమితం లేని కొడుకుతో పాటు, ఇంట్లో ఉండే కూతురు తల్లి కలిసి ముగ్గురు కలిసి ఉంటున్నారు.

అయితే అకస్మాత్తుగా ఇద్దరు మృతి చెందారు. ఎలా చనిపోయారనేది తెలియకుండా ఉంది. దుర్వాసన రావడంతో గ్రామస్థులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇద్దరు మహిళలు చనిపోయినా..వారి మధ్య మతి స్థిమితం లేని యువకుడు కూడ వారితోనే ఉండడం గమనార్హం. మృతదేహలను జేసిబీ సహాయంతో బయటకు తీశారు. మృతికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు