ప్రమాదాలు అంటేనే ఎప్పుడు ఎలా జరుగుతాయో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని ప్రమాదాలు జరిగే తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అసలు ఆ సంఘటన ఇలా ఎందుకు జరిగి ఉంటుందనేది చూసిన వారికి అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే కొన్ని ప్రమాదాలు జరిగిన తర్వాత వాటి వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ కూడా చేస్తాయి..
ఇలా తాజాగా ఊహించని సంఘటన ఒకటి ఖమ్మంలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణంలోని రావిచెట్టు బజార్ లోని ఒక బట్టల షాపులోకి అనుహ్యంగా ఓ బైకు దూసుకువచ్చింది. షాపులోకి వచ్చిన బైకు అక్కడ ఉన్న బట్టలను ఢీకొట్టి ఏకంగా కౌంటర్ వద్దకు చేరి కింద పడిపోయింది. దీంతో ఆ బైకర్ ఎగిరి షాపులోపల ఉన్న కౌంటర్‌లోపల ఎగిరి పడ్డాడు.. అయితే ఆ బైకర్‌కు ఎలాంటీ గాయాలు మాత్రం కాలేదు..ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే లేచి తన బైక్ వద్దకు చేరుకున్నాడు. అయితే ప్రమాదం జరిగినప్పుడు షాపులో ఇద్దరు మహిళలు షాపింగ్ చేస్తుండగా వారు భయాందోళనలకు గురయ్యారు.. బైకు ఒకవేళ మహిళలను నేరుగా ఢీకొని ఉంటే ఆ వేగానికి తీవ్ర గాయాలు అయ్యె అవకాశాలు భయాందోళనలు వ్యక్తం చేశారు.
మొత్తం మీద ఎవరికి గాయాలు కాకున్నా ప్రమాదం జరిగిన తీరు మాత్రం ఆశ్చర్యకరంగా కనిపించడంతో ఆ ప్రమాదం నగరంలో చర్చనీయంశంగా మారడంతో పాటు ఆ వీడీయో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.