హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad:జంతువులు రాకుండా పొలానికి కరెంట్ వైర్ పెట్టాడు..అవి తగిలి రైతు బిడ్డే చనిపోయాడు

Adilabad:జంతువులు రాకుండా పొలానికి కరెంట్ వైర్ పెట్టాడు..అవి తగిలి రైతు బిడ్డే చనిపోయాడు

(విద్యుత్‌ వైర్లు తగిలి..)

(విద్యుత్‌ వైర్లు తగిలి..)

Adilabad:ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇద్దర్ని మృత్యువు వెంటాడింది. కరెంట్‌ షాక్‌తో ఒకరు పెళ్లి వెళ్తూ రోడ్డు యాక్సిడెంట్‌లో మరొకరు చనిపోయారు. ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

(K.Lenin,News18,Adilabad)

ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అటవీ జంతుల నుంచి పంట పొలాన్ని కాపాడుకునేందుకు విద్యుత్‌ కంచె(Electric fence)..పొలం యజమానిని బలిగొంది. అదే కరెంట్ తీగలు అభం, శుభం తెలియని మరో మహిళను మృత్యురూపంలో వెంటాడి ప్రాణాలు పొట్టనపెట్టుకుంది. తాంసి Tamsiమండలం జామిడి(Jamidi)గ్రామంలో ఈ విషాద ఘటన రెండు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సురుకుంటి కృష్ణారెడ్డి (Surukunti Krishnareddy)తన పంటను అటవీజంతువుల నుంచి కాపాడుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్‌ తీగలు అమర్చాడు. రాత్రి చేనుకు వెళ్లిన రైతు కరెంట్ తీగలకు విద్యుత్ సరఫరాను ఆన్ చేసి వచ్చాడు. ఆ విషయం తెలియని రైతు కొడుకు కమలాకర్‌రెడ్డి (Kamalakar Reddy)ఎప్పటి లాగే ఉదయం జొన్న పంటకు నీళ్ళు పెట్టేందుకు వెళ్ళాడు. విద్యుత్‌ తీగలు తగలడంతో కరెంట్‌ షాక్ (Current‌ shock)తగిలి స్పాట్‌లో మృతి చెందాడు. పొలానికి వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవడంతో కృష్ణారెడ్డి వెళ్లి చూడగా కొడుకు శవమై కనిపించాడు. డిగ్రీ చదువుతున్న కొడుకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో తండ్రికి సాగు పనుల్లో సాయం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే విద్యుత్‌ తీగలకు బలవడం స్థానికంగా అందర్ని కలచి వేసింది. వారం రోజుల క్రితం కమలాకర్‌రెడ్డి కొడుక్కి నామకరణం చేశారు కుటుంబ సభ్యులు. ఇంతలోనే విద్యుత్ షాక్ రూపంలో ఓ బిడ్డకు తండ్రిని, మరో తండ్రికి కొడుకు దూరమవడం అందర్ని బాధించింది.

జంతువులకు బదులు..

జైనాథ్‌ మండలంలో కూడా మరో కుటుంబాన్ని విధి వెక్కిరించింది. పెళ్లికి బైక్‌పై మనవడితో వెళ్తున్న దంపతులు అంతరాష్ట్ర రోడ్డుకు మూల మలుపు దగ్గర యాక్సిడెంట్‌కు గురయ్యారు. వాహనం అదుపు తప్పి కిందపడిపోయింది. బైక్‌పై వెనుక కూర్చున్న మహిళ తలకు బలమైన గాయం కావడంతో స్పాట్‌లో చనిపోయింది. డ్రైవింగ్ చేస్తున్న భర్త, మనవడికి స్వల్పగాయాలయ్యాయి. మృతురాలు బేలం మండలం కాప్సి గ్రామానికి చెందిన కామిని బాయిగా గుర్తించారు. గాయపడిన ఆమె భర్త, మనవడ్ని 108 వాహనంలో ట్రీట్‌మెంట్‌ కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు.

(వెంటాడిన మృత్యువు)

వెంటాడిన మృత్యువు..

ఆదిలాబాద్ జిల్లాలో ఒక కుటుంబంలో వేడుక జరిగి వారం గడవకముందే ఒకరు విద్యుత్‌ షాక్‌కి బలయ్యారు. పెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మరో కుటుంబానికి చెందిన మహిళ దుర్మరణం చెందింది. ఇలా వేర్వేరు ఘటనల్లో మృత్యువు ఇద్దర్ని బలిగొనడం అందర్ని తీవ్రంగా బాధించింది. రెండు వేర్వేరు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాల్ని పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

First published:

Tags: Adilabad, Farmer