Telangana: సంగారెడ్డి జిల్లాలో విషాదం.. చేపలు పట్టేందుకు చెరువులో దిగిన ఆ ఇద్దరు.. ప్రమాదవశాత్తు..

ఘటనా స్థలం వద్ద ప్రమాదపు దృశ్యాలు

Telangana: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటే వారి పాలిట మృత్యు పాశమైంది. చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్‌లో చోటు చేసుకుంది.

  • Share this:
    పొలానికని వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఎంతకూ ఇంటికి రాలేదు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. తెల్లారేసరికి ఊరి చెరువు గట్టుపై ఆచూకీ లభించకుండా పోయిన వారి చెప్పులు బయట ఉండటం గమనించిన గ్రమస్తురాలు సర్పంచ్ కి సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న సర్పంచ్ ఆ శవాలను బయటకు తీయించారు. మృతులు గ్రామానికి చెందిన సాయిలు(35), సంగమేశ్వర్(23) లుగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నిజాంపేటలో ఓ రాత్రి ఇద్దరు వారి పొలానికి వెళ్తుండగా దారిలో ఉన్న చెరువులో చేపలు పడదామనే ఉద్దేశంతో అందులోకి దిగి లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోయారు. పొలానికి వెళ్లిన వారు తెల్లవారినా ఎంతకూ ఇంటికి రాకపోవడంతో సాయిలు భార్య చేను వద్దకు వెళ్లి చూడగా చెరువు వద్ద ఇద్దరి చెప్పులు కనబడగా ఇందులోనే ఉన్నారని తెలుసుకొన్న సాయిలు భార్య గ్రామ సర్పంచ్ జగదీష్ చారికి తెలపడంతో ఆయన అక్కడికి చేరుకొని ని గాలింపు చర్యలు నిర్వహించడంతో ఇద్దరీ మృతదేహాలు అందులోనుంచి బయటకు తీశారు.

    మృతుడు సాయిలుకి భార్య ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. సంగమేశ్వర్ కు ఇంకా పెళ్లి కాలేదు. మేస్త్రి పని చేసేవాడు. నిరుపేదలైన వీరి కుబుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న నారాయణఖేడ్ ఎస్ ఐ వెంకటరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీరి మృతితో నిజాంపేట్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
    Published by:Veera Babu
    First published: