త్వరలో జాతీయ పార్టీ పెట్టనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR).. దేశభక్తి ఉట్టిపడేలా రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకలకు (75th Independence Day) ఆదేశించడం తెలిసిందే. నేటి నుంచి భారత స్వతంత్ర వజ్రోత్సవాలుఘనంగా ప్రారంభం కానున్నాయి. 15 రోజులపాటు తెలంగాణ (Telangana) వ్యాప్తంగా సాగే ఈ ఉత్సవాలను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా సోమవారం ఉదయం 11:30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
సీఎం కేసీఆర్ హెచ్ఐసీసీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. అనంతరం జాతిపిత గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పిస్తారు. తరువాత సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు తిలకిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందేశాన్ని సీఎం ఇస్తారు.
అత్యం త ఘనంగా దేశభక్తి ఉట్టిపడేలా రెండు వారాలపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీఎస్ సోమేశ్‌కుమార్ చెప్పారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక పాసులు జారీచేశామని, జిల్లాల నుంచి వచ్చేవారికి వాహన సదుపాయాలు కల్పించామని వివరించారు.
హెచ్‌ఐసీసీకి వెళ్లే అన్ని మార్గాలను జాతీయ జెండాలతో అలంకరించారు. నగరంలోని అన్ని జంక్షన్‌లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. సీఎస్ సోమేశ్ కుమార్‌తోపాటు జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, అదనపు డీజీ జితేందర్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనిల్‌కుమార్ ఉన్నారు. వజ్రోత్సవ వేడుకలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమాలతో ముగుస్తాయి. ఈ ఉత్సవాల నిర్వహణను ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ నిర్వహిస్తున్నది.
స్వాతంత్ర్య వజ్రోత్సవాల పూర్తి షెడ్యూల్ ఇదే
1)ఆగస్టు 08: ప్రారంభ సమారోహం. 2)ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం. 3)ఆగస్టు 10: వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామాల్లో మొకలు నాటడం, ఫ్రీడం పారుల ఏర్పాటు. 4)ఆగస్టు 11: ఫ్రీడం రన్ నిర్వహణ. 5)ఆగస్టు 12: రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి. 5)ఆగస్టు 13: విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు. 6)ఆగస్టు 14: సాయంత్రం.. సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక, జానపదకార్యక్రమాలు. ప్రత్యేకంగా పటాకులతో వెలుగులు. ఇంకా..
7)ఆగస్టు 15: స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణ. 8)ఆగస్టు 16: ‘ఏకకాలంలో, ఎకడివారకడ ’తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు,ముషాయిరాల నిర్వహణ. 9)ఆగస్టు 17: రక్తదాన శిబిరాల నిర్వహణ. 10)ఆగస్టు 18: ఫ్రీడం కప్ పేరుతో క్రీడల నిర్వహణ. 11)ఆగస్టు19: దవాఖానలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, జైళ్లల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ. 12)ఆగస్టు 20: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీ. 13)ఆగస్టు 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతోపాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం. 14)ఆగస్టు 22: ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Azadi Ka Amrit Mahotsav, CM KCR, Hyderabad, Independence Day, Telangana