మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు మార్గంలో ట్రాక్ నంబర్ వన్, ట్రాక్ నంబర్ 2 ఉంటాయి. అయితే ట్రాక్ నంబర్ వన్ లో విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్స్ వెళ్తుంటాయి. ట్రాక్ నంబర్ 2 లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్తాయి. అయితే ట్రాక్ నంబర్ వన్ లో ఇద్దరు ట్రాక్ మెన్లు తమ విధి నిర్వహణలో ఉండగా ఈ సమయంలో ఒకటో ట్రాక్‌పై రైలు రావడంతో వెంటనే రెండో ట్రాక్‌పైకి వెళ్లారు. ఆ ట్రాక్ పై సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వారిని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడిక్కడే మరణించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు రూల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఉన్నాయి. మహబూబాబాద్ శివారు ప్రాంతంలో ఎండీ పాషా(40), కమలాకర్ చారి(36) కలిసి ట్రాక్‌పై పనులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరు ట్రాక్ మెన్లు గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో సికింద్రాబాద్ వైపు వెళ్లే రైలు మార్గంలో పట్టాలను సరిచేస్తుండగా సడన్ గా రైలు వచ్చింది.
దానిని గమనించిన వారు వెంటనే ట్రాక్ నంబర్ 2 కి వెళ్లారు. ఆ సమయంలో నే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు కోణార్క్ ఎక్స్ ప్రెస్ వచ్చే విషయాన్ని వాళ్లు గమనించలేదు. అటుగా వెళ్తున్న ఆ రైలు శబ్ధానికి విజయవాడ వైపు వెల్లే రైలు శబ్ధం వినపడలేదు.
వేగంగా వచ్చిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఇద్దరు ట్రాక్‌మెన్లను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి రెండు రైళ్లు రావడం, ట్రాక్‌మెన్లు గమనించకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. దీంతో వారి మృతుల కుబుంసభ్యుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Konark Express, Mahabubabad District, Railway Police, Track Mens, Train accident