ప్రకృతి విలయాలతో చనిపోతున్న వారిలో మూడోవంతు కన్నా ఎక్కువ మంది పిడుగుపాటు (Thunder) వల్లే చనిపోతున్నారు. పిడుగుపాటుకు గురై ప్రాణాలతో బయటపడిన వారు కూడా నీరసం, మగత, జ్ఞాపకశక్తి లోపం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. తాజాగా సాగులో మామకు ఆసరా ఇద్దామని అత్తగారింటికి వచ్చిన తోడల్లుళ్లు (Son in laws) పిడుగుపాటుకు (Lightning) బలైపోయారు. కొమురంభీం (Asifabad Komram Bheem) జిల్లాలో ఈ హృదయ విదారక సంఘటన జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన లోబడే రాంచందర్‌కు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వాంకిడి మండలం కోమాటిగూడకు చెందిన వాడుగురే సంతోష్ (38)తో, రెండో కుమార్తెకు ఆసిఫాబాద్ మండలం ఆర్‌ఆర్ కాలనీకి చెందిన ఆదె సంతోష్ (36)తో వివాహం జరిపించారు.
సాయంత్రం పని ముగించుకుని వస్తుండగా..
అయితే ఇంధాని క్రాస్ రోడ్డు వద్ద గల తన పత్తి చేనులో యూరియా వేసేందుకు రాంచందర్ ఇద్దరు అల్లుళ్లను బుధవారం నాడు ఇంటికి పిలిపించుకున్నాడు. పొద్దంతా కుటుంబ సభ్యులు పొలంలోనే గడిపారు. సాయంత్రం పని ముగించుకుని తోడల్లుళ్లు వాడుగురే సంతోష్, ఆదె సంతోష్ ఇద్దరు ఒకే బైక్‌పై ఇంటికి బయల్దేరారు. తేజాపూర్ గ్రామ శివారులో వీరి బైక్‌పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. వాడుగురే సంతోష్‌కు ఇద్దరు కుమారులు, ఆదె సంతోష్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
మూడేళ్ల కిందటే వ్యవస్థ..
పిడుగుపాటు (Lightning) ద్వారా ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఈ మెరుపుదాడుల గురించి ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థను భారత వాతావరణ శాఖ మూడేళ్ల కిందట ప్రారంభించింది. మొబైల్ యాప్స్ ఇప్పుడు పిడుగుపాట్లను ముందుగానే చెప్పగలుగుతున్నాయి. రేడియో, టీవీ వంటి మాధ్యమాల ద్వారా కూడా ఏయే ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందో చెబుతున్నారు.
Hyderabad: హైదరాబాద్ అలర్ట్ ! అవసరం ఉంటేనే బయటకి రండి.. పోలీసుల విజ్ఙప్తి! ఎందుకో తెలుసా?
ఇటీవలి కాలంలో దేశంలో పిడుగుపాట్ల (Lightning) సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇండియాలో 2020 ఏప్రిల్ - 2021 మార్చి మధ్య కాలంలో కోటికి పైగా పిడుగు పాట్లు పడ్డాయని ఒక అధ్యయనం వెల్లడించిది. అదే కాలంలో గత ఏడాది సంభవించిన పిడుగుపాట్లతో పోల్చితే ఇది 34 శాతం ఎక్కువ కావడం కొంత ఆందోళన కలిగించేదే. దేశంలోని చాలా రాష్ట్రాలలో పిడుగుపాట్లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించినప్పటికీ, 70 శాతం మరణాలు మాత్రం ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో సంభవించాయని నివేదికల స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పంట పొలాల్లో పని చేసే వారు ఈ ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, Heavy Rains, Telangana