హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికుల బెంబేలు...

హైదరాబాద్ మలక్ పేట - దిల్‌షుక్ నగర్ ప్రధాన రహదారి పై తృటిలో పెను ప్రమాదం తప్పింది.

news18-telugu
Updated: November 27, 2019, 3:21 PM IST
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికుల బెంబేలు...
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదం
  • Share this:
హైదరాబాద్ మలక్ పేట - దిల్‌షుక్ నగర్ ప్రధాన రహదారి పై తృటిలో పెను ప్రమాదం తప్పింది.
బస్ స్టాప్ లో ఆగి ఉన్న బస్సుని మరో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బస్సులో ప్రయాణికులు ఆరోపించారు. వేగంగా వెనుక నుంచి వచ్చి కంట్రోల్ తప్పడంతో ఢీ కొట్టింది. ఈ ఘటనతో మలక్ పేట దిల్‌షుక్ నగర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కాలేదు. చిన్న చిన్న గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత బస్సు ప్రమాదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ఆర్టీసీ బస్సును చూస్తే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది.

 
Published by: Ashok Kumar Bonepalli
First published: November 27, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading