వరంగల్ జిల్లాలో.. వేగంగా వచ్చిన ఓ కారు... ఆటోని ఢీకొట్టింది. ఆ తర్వాత కారు అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కేసు రాసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
హైదరాబాద్.. ఔటర్ రింగు రోడ్డుపై మరో ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని.. వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కారు గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కర్ణాటకకు చెందిన వ్యక్తిగా పోలీసులు తేల్చారు.
ఇలా ఈ రెండు ప్రమాదాల్లోనూ కార్లు అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్లే జరిగినట్లు తెలిసింది. స్పీడ్ లిమిట్స్ పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.