మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు... 12 మంది మృతి

Road Accident : రోడ్డు ప్రమాదాలు జరగకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

news18-telugu
Updated: March 16, 2020, 2:16 PM IST
మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు... 12 మంది మృతి
మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు... 12 మంది మృతి (File)
  • Share this:
Road Accident in Telangana : మెదక్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదం మిగిల్చాయి. కాల్చారం మండలం... సంగయ్యపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో... ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలవ్వగా... ఆస్పత్రికి తరలించారు. ఇదే జిల్లాలో సోమవారం తెల్లవారు జామున కూడా ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగ్‌ 44వ నేషనల్ హైవేపై ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను వెనక నుంచి ఓ ఓమ్ని వ్యాన్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓమ్నిలో వెళ్తున్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు సిరిసిల్లా జిల్లా దమ్మన్న పేట గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సిరిసిల్లకు వస్తున్న టైంలో ఓమ్ని వ్యాన్‌ మరో వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఇలా రెండు రోడ్డు ప్రమాదాలు... తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

First published: March 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading