హోమ్ /వార్తలు /తెలంగాణ /

Tiger Attack: మళ్లీ కనిపించిన పెద్దపులి.. చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న యువకులు

Tiger Attack: మళ్లీ కనిపించిన పెద్దపులి.. చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న యువకులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tiger Attack: తెలంగాణలో మరోసారి పెద్దపులి మనుషుల వెంటపడటం కలకలం రేపుతోంది.

తెలంగాణలోని ఉమ్మడి అదిలాబాద్‌లోని పలు ప్రాంతాల ప్రజలు ఇప్పుడు పెద్ద పుల్లి పేరు చెబితేనే గజగజ వణికిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడిపై పులి దాడి చేసి చంపేయడంతో.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎప్పుడు తమపై పులి దాడి చేస్తుందో అని భయపడుతున్నారు. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ వద్ద నడి రోడ్డుపై కనిపించిన పెద్ద పులి అక్కడి వారి వెంటపడటం కలకలం రేపుతోంది. రోడ్డుపైకి వచ్చిన పెద్దపులి.. ప్రయాణికులను, పాదచారులను వెంటాడింది. పులి వెంబడించడంతో ఇద్దరు యువకులు పరుగు తీశారు.

పులి నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు సమీపంలోని చెట్టు ఎక్కారు. ప్రమాదం తప్పడంతో బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. మరో ఇద్దరు యువకులు బైక్‌పై అక్కడి నుంచి తప్పించుకుని తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఆరుగురు వ్యక్తులు కమ్మర్గాం గుండె పల్లి గ్రామాల నుంచి బెజ్జూర్ మండల కేంద్రానికి వస్తోన్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులి సంచారంతో అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటేనే స్థానికులు, గిరిజనులు హడలిపోతున్నారు.

ఇక ఈ నెల 11న ఆసిఫాబాద్‌జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన 22 ఏళ్ల విఘ్నేష్‌పై పులి దాడి చేసి చంపేసింది. ఆ పులిని పట్టుకునేందుకు 12 బృందాలు రంగంలోకి దిగాయి. అయినా ఇప్పటివరకు పెద్దపులి జాడ దొరకలేదు. ఆ పులి మహారాష్ట్ర అడవుల వైపు వెళ్లిపోయి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా మరో పులి మనుషులపై దాడికి భయాందోళనలకు దారి తీస్తోంది.

First published:

Tags: Telangana, Tiger Attack

ఉత్తమ కథలు