(K.Veeranna,News18,Medak)
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ విషాద సంఘటన ఆ రెండు కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది. దేశ ప్రజలంతా స్వాతంత్య్ర ఉత్సవాల(Independence celebrations)ను ఘనంగా జరుపుకుంటున్న సమయంలో ఊహించని దుర్ఘటన సంగారెడ్డి(Sangareddy)జిల్లాలో చోటుచేసుకుంది. జాతీయ జెండా(National flag)ఎగురవేస్తూనే ఇద్దరు వ్యక్తులు(Two people died) మృత్యువాత పడ్డారు. జాతీయ జెండాకు వందనం చేస్తూనే నేలకొరిగిపోయిన దృశ్యం వారి కుటుంబ సభ్యులనే కాదు..జెండా ఆవిష్కరణకు వచ్చిన వారిని తీవ్రంగా బాధించింది.
పండుగ పూట విషాదం..
కుల,మతాలకు అతీతంగా దేశ ప్రజలంతా పండుగలా భావించే స్వాతంత్య్ర దినోత్సవం రోజున సంగారెడ్డి జిల్లాలో ఓ విషాద సంఘటన అందర్ని కలచివేసింది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న సమయంలో కరెంట్ విద్యుత్ సరఫరా అవుతున్న కరెంట్ స్తంభానికి తగిలి ఇద్దరు విద్యుత్‌ఘాతానికి గురయ్యారు. వెంకటేష్‌గౌడ్ అనే 42సంవత్సరాల వ్యక్తితో పాటు తిరుపతయ్య అనే 45ఏళ్ల వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
కరెంట్ షాక్ తగిలి..
జాతీయ జెండా ఎగురవేస్తూ విద్యుత్ ఘాతంతో ఇద్దరుచనిపోయిన విషయం తెలుసుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే జి.మహిపాల్‌రెడ్డి హుటాహుటిన పటాన్‌చెరు పట్టణంలో మాక్స్ క్యూర్ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని మహిపాల్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మృతదేహాలకు పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, వారి స్వగ్రామాలకు తరలించాలని డిఎస్పీ భీమ్ రెడ్డిని ఆదేశించారు.
జెండా ఎగురవేస్తూనే నేలరాలిపోయారు..
దేశప్రజలంతా పండుగ జరుపుకుంటున్న సమయంలో తమ కుటుంబ సభ్యులు కరెంట్ షాక్ తగిలిన చనిపోవడాన్ని మృతుల కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. మృతదేహాల దగ్గర బోరున విలపించారు. పర్వదినం రోజున ఇంతటి విషాద సంఘటన జరగడం స్థానికుల్ని కూడా తీవ్రంగా కలచివేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.