mother murder : పక్కింటి కుర్రాడితో అదేం పనంటూ తల్లి వార్నింగ్... కక్ష కట్టిన కూతురు.. ఇద్దరు కలిసి దారుణం

ప్రతీకాత్మక చిత్రం

mother murder : మైనర్ వయస్సులో ప్రేమ పేరుతో తిరుగుతున్న కూతురును తల్లి మందలించింది.. అంతే అది నచ్చని ఆమైనర్ తురు తన మైనర్ ప్రేమికుడితో కలిసి తండ్రి ఇంట్లో లేని సయమంలో తల్లి గొంతు పిసికి చంపేసింది.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

  • Share this:
    ప్రస్తుతం సమాజంలో ప్రేమ ( love ) సర్వస్వం అన్నట్టు పిల్లలు వ్యవహరిస్తున్నారు.దీంతో తమ ప్రేమను
    దక్కించుకునేందుకు అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. తమ జీవితం గమ్యం ఏమిటో తెలియకుండా చివరకు ప్రాణాలు తీసుకోవడంతో పాటు అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తున్నారు.. ఈ క్రమంలోనే జీవిత కాలం కలిసి ఉండాల్సిన ప్రేమికులు కటకటలా (jail) పాలు కావడం లేదా ఇతర మార్గల్లో ప్రాణాలు తీసుకోవడం అనే ధోరణిలో పయణిస్తున్నారు.

    తాజాగా ఇలాంటీ సంఘటనే ఒకటి హైదరాబాద్‌లో ( Hyderabad ) చోటు చేసుకుంది. తన కూతురు ప్రేమ పేరుతో (daughter love ) మరో వ్యక్తితో తిరుగుతుండడంతో తల్లి మందలించింది. దీంతో ఆ కూతురు కన్న తల్లినే కడతేర్చింది. అది కూడ ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. చివరికి పోలీసులు ఎంటర్ కావడంతో అసలు నిజం బయటపడింది.

    ఇది చదవండి :  అక్టోబరు 19 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి విజయావకాశాలు ...


    పదిహేడేళ్ల వయసులో ప్రేమలో ( love ) పడిన బాలిక ప్రియుడితో కలిసి కన్నతల్లినే కడతేర్చిన ఘటన
    రాజధానిలో సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌ చింతల్‌మెట్లో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, సీఐ కనకయ్యలు తెలిపిన వివరాల మేరకు...చింతల్‌మెట్లో నివసించే దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తె వివాహం చేశారు. చిన్న కుమార్తె (17) స్థానికంగా ఉండే ఓ బాలుడి(17)తో ప్రేమలో పడింది. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో పలుమార్లు మందలించింది.

    ఇది చదవండి : దళిత బంధు బ్రేక్‌కు కారణం సీఎం కేసీఆర్.. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్..


    అతడితో తిరగొద్దని సోమవారం మధ్యాహ్నం మరోసారి చెప్పింది. అదే సమయంలో అక్కడికి బాలుడిని
    పిలిపించుకున్న బాలిక తల్లితో తీవ్ర వాగ్వాదం పెట్టుకుంది. తర్వాత తల్లి మెడకు చున్నీ చుట్టి బాలుడి
    సహాయంతో హత్య (murder ) చేసింది. అనంతరం తన తల్లి కిందపడి చనిపోయిందని చుట్టుపక్కల వారికి తెలిపింది.ఆ సమయంలో ఆమె తండ్రి ఇంట్లో లేరు.ఆయనతో పాటు స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ( police ) బాలుడిని, బాలికను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు.
    Published by:yveerash yveerash
    First published: