హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad news : కళ్ల ముందే భార్య వేరే వ్యక్తి బైక్ ఎక్కింది.. కాసేపటికే ఇద్దరూ చనిపోయారు..అసలు ఏం జరిగిందంటే

Sad news : కళ్ల ముందే భార్య వేరే వ్యక్తి బైక్ ఎక్కింది.. కాసేపటికే ఇద్దరూ చనిపోయారు..అసలు ఏం జరిగిందంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sad news: సిద్దిపేట జిల్లాలో కూలి పనికి వెళ్లి వస్తున్న భార్యభర్తల్లో భార్య ప్రమాదవాశత్తు మృతి చెందింది. ట్రాక్టర్‌లో భర్తతో ఇంటికి వెళ్తున్న వివాహిత వేరే వ్యక్తి బైక్‌పై కూర్చోవడం వల్లే ప్రాణాలు విడిచింది. బైక్‌ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా ఆమెతో పాటే దుర్ఘటనలో ప్రాణాలు విడిచాడు. అసలు ఏం జరిగిందంటే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Siddipet, India

(K.Veeranna,News18,Medak)

ఒక రోడ్డు ప్రమాదం (Roadaccident)రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఒక కుటుంబానికి మగదిక్కు లేకుండా పోతే .. ఫ్యామిలీ ఇంటి ఆడబిడ్డను దూరం చేసుకుంది. సిద్దిపేట(Siddipeta) జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. భార్య భర్తలు కలిసి కూలికి వెళ్లి వస్తుండగా జరిగిన విషాద ఘటనలో భర్త భార్యను కోల్పోతే ..అన్న తమ్ముడ్ని దూరం చేసుకున్నాడు.

Fake Doctor : 43వేల మందికి ట్రీట్‌మెంట్ చేసిన సింగిల్ డాక్టర్ .. అతనే వరంగల్‌ శంకర్‌దాదా MBBS



భర్త కళ్ల ముందే భార్య మృతి..

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహితురాలు, మరో వ్యక్తి మృతి చెందారు. మృతురాలు కోమటిబండ గ్రామానికి చెందిన వల్లెపు అనితగా గుర్తించారు. అనిత భర్త వల్లెపు కనకయ్యతో కలిసి గజ్వేల్‌కు పనికి వెళ్లింది. కూలీ పని ముగియగానే తిరిగి కోమటిబండకు ట్రాక్టర్‌పై భార్యభర్తలు వస్తున్నారు. అదే సమయంలో ట్రాక్టర్ చెడిపోవడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. ట్రాక్టర్‌ డ్రైవర్ చాకలి సురేష్ తన తమ్ముడు ప్రశాంత్‌కి ఫోన్ చేసి ట్రాక్టర్ చెడిపోయిన విషయం చెప్పడంతో అతను బైక్ వేసుకొని వచ్చి ట్రాక్టర్‌ని రిపేర్ చేశాడు.

అన్న చూస్తుండగానే తమ్ముడు మృతి..

చెడిపోయిన ట్రాక్టర్ బాగు చేయడంతో ..వల్లెపు కనకయ్య, డ్రైవర్‌ సురేష్‌ ట్రాక్టర్‌పై ఉన్నారు. కనకయ్య భార్య అనిత ప్రశాంత్ తెచ్చిన బైక్‌ ఎక్కించుకొని ట్రాక్టర్ వెనుకాలే గజ్వేల్‌కు బయల్దేరాడు. కొద్ది దూరం వెళ్లగానే ట్రాక్టర్‌లో డీజిల్ అయిపోవడంతో షడన్‌గా ఆగిపోయింది. బైక్‌ స్పీడుగా నడుపుతున్న ప్రశాంత్ ట్రాక్టర్ ఆగిపోయిన విషయాన్ని గమనించలేదు. బైక్ స్పీడ్ కంట్రోల్‌ కాకపోవడంతో వెనుక నుంచి ట్రాక్టర్‌ని ఢీకొట్టాడు. ప్రమాదంలో అనిత స్పాట్‌లో మృతి చెందడంతో ట్రాక్టర్ పై కూర్చున్న భర్త కనకయ్య బోరున విలపించాడు.

Hyderabad : కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో నేరాలకు చెక్ .. పోలీసింగ్ వ్యవస్థ బలంగా ఉంటేనే ప్రజలకు రక్షణ: కేసీఆర్


ఊహించని ఘటన..

మరోవైపు బైక్ నడుపుతున్న ప్రశాంత్‌కు కూడా తీవ్రగాయలవడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ప్రశాంత్‌ కూడా స్పాట్‌లోనే ప్రాణాలు విడిచిపెట్టడంతో తమ్ముడి చావును కళ్ల ముందు చూసి ట్రాక్టర్ డ్రైవర్ సురేష్‌ కన్నీటిపర్యంతమయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు చనిపోవడంతో గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి పెద్ద సంఖ్యలో బంధువులు, స్థానికులు వచ్చారు. మృతుల కుటుంబాలను ఎస్టీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి పరామర్శించారు.

First published:

Tags: Road accident, Siddipeta, Telangana News

ఉత్తమ కథలు