హోమ్ /వార్తలు /తెలంగాణ /

అమ్మో పులులు.. ఈ సారి మరో జిల్లాలో హడలెత్తిస్తున్న రెండు చిరుతలు

అమ్మో పులులు.. ఈ సారి మరో జిల్లాలో హడలెత్తిస్తున్న రెండు చిరుతలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె తండా వద్ద చిరుత కనిపించడంతో తండాకు చెందిన రైతులు పొలాల వైపు వెళ్ళడానికి జంకుతున్నారు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో కారులో కొండపైకి వెళ్తున్న భక్తునికి రెండు చిరుత పులులు అడ్డం రావడంతో భయపడి వెనక్కి వచ్చేశానని తెలిపాడు. సమీప గ్రామానికి చెందిన ఓ అయ్యప్ప భక్తుడు నిన్న సాయంత్రం కొండ పైకి దైవదర్శనానికి వెళ్తుండగా చిరుతను చూశానని తెలిపాడు. దీంతో చిరుత విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సాయంత్రం సమయంలో కొండ పైకి వెళ్లే దారిలో ఉన్న చెరువు వద్దకు వస్తున్నాయని స్థానికులు కొందరు చెబుతున్నారు. నిన్న అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో నిన్న సాయంత్రం అధికారులు వచ్చి పులి జాడ సేకరించారు. కానీ పులి మాత్రం కనిపించలేదని చెపుతున్నారు. రైతులు మాత్రం చీకటి కాగానే పంట పొలాలకు, బయటకు వెళ్ళడానికి భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత పులులను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.

ఏపీలో వారికి నెలకు రూ.10వేలు, సీఎం జగన్ ముందు ప్రతిపాదన

ఉపాధ్యాయ దినోత్సవం లాగా జగన్ బర్త్ డే రోజున ఏపీలో ప్రత్యేక దినోత్సవం

Oppo Slide Phone : ఒప్పో నుంచి క్రెడిట్ కార్డు సైజ్‌లో స్లైడ్ ఫోన్, ఇండియాలో లాంచ్ ఎప్పుడు?

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరిని చంపిన పులులు

తెలంగాణలోని అటవీ ప్రాంత గ్రామాల్లో పులులు అలజడి కొనసాగుతోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామంలో ఓ యువతిపై పులి దాడి చేసి చంపేసింది. పత్తి చేనులో పత్తి ఏరుతున్న పసుల నిర్మల అనే యువతిపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా కూలీలు ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పులి వెనక నుంచి దాడి చేయడంతో ఎవరూ ప్రమాదాన్ని ఊహించలేకపోయారు. అంతకు ముందు నవంబర్‌ 11న దహెగాం మండలం దిగుడ గ్రామంలో ఓ పులి గిరిజన యువకుడిపై దాడి చేసి హతమార్చింది. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే మరో ఘటన చోటుచేసుకోవడం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి మణుగూరు ఏరియా ప్రకాశం గని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పెద్దపులి కలకలం సృష్టించింది. డిసెంబర్ 10న ఉదయం పెద్దపులి సంచరిస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ కు పులి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన జీఎం రమేష్ పులి సంచరించిన పైపుల యార్డును పరిశీలించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పులి సంచరించిన ప్రదేశంలో, యార్డులో కాలి వేలిముద్రలను అధికారులు గుర్తించారు. ఆ వేలి ముద్రలను ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. పులి సంచరించిందన్న వార్త తెలియడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

First published:

Tags: Mahbubnagar, Telangana, Tiger, Tiger Attack

ఉత్తమ కథలు