హోమ్ /వార్తలు /తెలంగాణ /

Indian Students: అమెరికా ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం, మరో ముగ్గురికి గాయాలు

Indian Students: అమెరికా ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం, మరో ముగ్గురికి గాయాలు

వంశీ, పవన్(పాత ఫొటోలు)

వంశీ, పవన్(పాత ఫొటోలు)

అమెరికాలో ఉన్నత చదవులు అభ్యసిస్తోన్న ఇద్దరు తెలంగాణ యువకులు అనూహ్య ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రమాదంలోనే మరో ముగ్గురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

విదేశాల్లో చదువుతోన్న భారతీయ విద్యార్థులకు సంబంధించి మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అమెరికాలో ఉన్నత చదవులు అభ్యసిస్తోన్న ఇద్దరు తెలంగాణ యువకులు అనూహ్య ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రమాదంలోనే మరో ముగ్గురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు, అమెరికన్ మీడియా ద్వారా వెల్లడైన వివరాలివి..

అమెరికాలోని తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని అలెగ్జాండర్‌ కౌంటీ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఖమ్మం జిల్లా ఏన్కురు మండలం జన్నారం గ్రామానికి చెందిన స్వర్ణ పవన్‌ (23) కాగా, రెండో యువకుడు హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన పీచెట్టి వంశీకృష్ణ.

Hanuman Chalisa: బెయిల్ వద్దంటూ ఠాణాలో రాణా దంపతుల రచ్చ.. హీరోయిన్ Navneet kaur ఇప్పుడిలా


స్వర్ణపవన్‌ 2021 ఆగస్టులో ఇల్లియాస్‌ యునివర్సిటీలో ఎంఎస్‌ చదివేందుకు అమెరికా వెళ్లారు. ఈనెల 21న ఇల్లియాస్‌ యూనివర్సిటీకి కారులో తన స్నేహితులతో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవింగ్‌ చేస్తున్న పవన్‌, పక్కన కూర్చున్న ఆయన స్నేహితుడు వంశీకృష్ణ అక్కడిక్కడే మృతి చెందారు. వీరితో పాటు కారులో ఉన్న స్నేహితులు యస్వంత్‌, కార్తీక్‌, కళ్యాణ్‌ కు గాయాలయ్యాయి.

Prashant Kishor విషయంలో CM KCR అనూహ్య వ్యూహం! -TRSలో చంద్రబాబు ఫార్ములా?


కారు ప్రమాద ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి పవన్‌ మృతదేహాన్ని ఆయన సోదరికి అప్పగించారు. మృతదేహం సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకుంటుందని, అక్కడి నుంచి జన్నారానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

First published:

Tags: Car accident, Students, Telangana, USA

ఉత్తమ కథలు