హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bonalu: పాతబస్తీ బోనాల ఉత్సవంలో ఉద్రిక్తత.. కర్రలతో దాడులు.. రంగంలోకి అడిషనల్​ సీపీ

Bonalu: పాతబస్తీ బోనాల ఉత్సవంలో ఉద్రిక్తత.. కర్రలతో దాడులు.. రంగంలోకి అడిషనల్​ సీపీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో బోనాల (Bonalu) ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని పాతబస్తీలో లాల్ దర్వాజాలో కూడా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా, సడెన్​గా బోనాల ఉత్సవంలో  రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

తెలంగాణలో బోనాల (Bonalu) ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని (Hyderabad) పాతబస్తీలో (Old city) లాల్ దర్వాజాలో కూడా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ప్రారంభం అయ్యాయి. మాజీమంత్రి దేవేందర్‌ గౌడ్‌ కుమారుడు వీరేందర్‌ గౌడ్‌ దంపతులు మొదటి బోనం సమర్పించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారికి భోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సింహవాహిని మహంకాళి (Simhavahini Mahankali) అమ్మవారికి వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) బంగారు బోనం సమర్పించారు. అంతకు ముందు బ్యాడ్మింటెన్ స్టార్ పీవీ సింధు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంప‌తులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, సడెన్​గా బోనాల ఉత్సవంలో  రెండు వర్గాల (Two groups) మధ్య ఘర్షణ జరిగింది.

లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారి ఆలయ సమీపంలో ఓ బృందంపై కొందరు ఒక్కసారిగా కర్రలతో దాడికి దిగారు. పోతలింగం ఆలయానికి చెందిన పోతురాజులు (PothuRajulu) రవీందర్‌, సుధాకర్‌లు 20 మంది బృందంతో లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు.

కర్రలతో దాడికి చేసుకున్నారు. ఈ దాడిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోతురాజు రవీందర్‌కు ఎడమకంటి వద్ద గాయమై తీవ్ర రక్తస్రావమైంది. పాత గొడవలే ఈ దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సౌత్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు (Southzone Task Force Police) వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు. లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ సీపీ చౌహాన్‌ (Law and Order Additional CP Chauhan) ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మరో వర్గం సింహవాహిని అమ్మవారి దేవాలయం (Simhavahini Goddess Temple) వద్ద నిరసన తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని మరో వర్గం డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు (Police) చెప్పడంతో ఆందోళన విరమించారు.

ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు..

అంతకుముందు బోనాల ఉత్సవంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంప‌తులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు అనంత‌రం అమ్మవారిని ద‌ర్శించుకుని ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. అంతకుముందు మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారికి, శాలిబండలోని అక్కన్న మాదన్న, అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

First published:

Tags: Bonalu, Hyderabad, Old city

ఉత్తమ కథలు