TWO FRIENDS WHO WENT JOLLY TOUR NEAR LAKE WERE DEATH BY ACCIDENT IN NIRMAL VRY
Nirmal : చేపలు ఎలా పడుతున్నారో తెలుసుకుందామని వెళ్లారు.. ఇంతలోనే ఇద్దరు ఫ్రెండ్స్...
ప్రాజెక్టులో మునిగిన ఇద్దరు మిత్రులు
Nirmal : విహార యాత్ర ఇద్దరు ప్రాణాలను తీసింది.. నీళ్లలో జారి పడ్డ స్నేహితుడి ప్రాణాలను కాపాడబోయి మరో స్నేహితుడు సైతం ప్రాణాలు వదిలాడు.. దీంతో ఇద్దరు స్నేహితుల మృతి ఆ గ్రామంలో విషాదం నింపింది.
సరదా ఇద్దరు మిత్రుల ప్రాణాల మీదకు వచ్చింది. జాలీగా గడుపుదామనుకుని స్నేహితులంతా కలిసి వెళితే ట్రాజెడి మిగిలిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కుంట ఏరియా ప్రాంతానికి చెందిన ఆరుగురు మిత్రుల బృందం పట్టణ శివారులో ఉన్న గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్దకు విహార యాత్రకు వెళ్ళారు. ప్రాజెక్టు వద్ద సరదాగా గడుపుతున్న ఆ స్నేహితులకు ప్రాజెక్టులో చేపలుపడుతున్న జాలర్లు కంటపడటంతో వారి వద్దకు వెళ్లి చేపలను ఎలా పడుతున్నారో గమనించాలనుకున్నారు. అందుకోసం పక్కన ఉన్న బండరాళ్ళలపై నడుచుకుంటూ జాలర్లవైపు కదిలారు.
ఈ క్రమంలో సయ్యద్ సోహెల్ అనే యువకుడు బండ రాయిపై పెట్టిన కాలు ప్రమాదవశాత్తు జారడంతో ప్రాజెక్టు నీటి పడి మునిపోయాడు. అతని వెనుకనే ఉన్న సయ్యద్ ఫేరోజ్ అనే యువకుడు నీటిలో మునిగిపోతున్న మిత్రుడి చేయి అందుకొని అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఆ యువకుడు కూడా అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. ఇదరు మిత్రులు నీటిలో పోతుండటం గమనించిన మిగిలిన నలుగురు యువకులు వారిని కాపాడే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చివరకు మిత్రులను రక్షించండంటూ కేకలు వేయడంతోపాటు జాలర్లతోపాటు స్థానికులు పరుగున వచ్చి నీట మునిగిన ఆ ఇద్దరు యువకులను అతి కష్టం మీద బయటకు తీశారు.
కాని అప్పటికే ఆ ఇద్దరు మృతి చెందారు. విషయం తెలిసిన మృతుల కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని బోరున విలపించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భైంసా పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.