హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mancherial:నలుగురు ఫ్రెండ్స్‌ మధ్య పెళ్లి సంతోషం..చావు విషాదంగా మార్చేసింది..

Mancherial:నలుగురు ఫ్రెండ్స్‌ మధ్య పెళ్లి సంతోషం..చావు విషాదంగా మార్చేసింది..

(డేంజర్ జర్నీ)

(డేంజర్ జర్నీ)

mancherial:ఫ్రెండ్ పెళ్లి కోసం వెడ్డింగ్‌ ఫోటోషూట్‌కి వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతి చెందారు. మంచి లొకేషన్స్‌ కోసం గోదావరిఖని నుంచి మంచిర్యాలకు కారులోవెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్‌ జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

ఇంకా చదవండి ...

(P.Sriniva,News18Telugu,Karimnagar)

పెళ్లి , చావు ఈ రెండు జీవితంలో మరిచిపోలేని ఘటనలు. పెళ్లి జ్ఞాపకాల కోసం వెళితే అది చావును పరిచయం చేస్తుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు. ఫలితంగా ఓ స్నేహితుడి పెళ్లి కోసం ఫోటో షూట్‌(Wedding photoshoot)కి వెళ్లిన నలుగురు మిత్రుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విషాదంతో కూడుకున్న ఈఘటన మంచిర్యాల(mancherial)జిల్లాలో జరిగింది. గోదావరిఖని (Godavarikhani)పారిశ్రామిక ప్రాంతంలో నివసించే నలుగురు ప్రాణ స్నేహితులు కారులో మంచిర్యాల దగ్గరున్న కొన్ని లొకేషన్స్‌లో ఫోటోలు దిగేందుకు కారులో వెళ్లారు. నలుగురూ క్లోజ్‌ ఫ్రెండ్స్ కావడంతో డ్రైవర్‌ లేకుండా కారును సెల్ఫ్ డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లారు. శనివారం (Saturday)ఉదయం చుట్టు పక్కల లొకేషన్లలో ఫోటోలు దిగారు. సాయంత్రం 5గంటల సమయంలో కారులో రిటన్ జర్నీలో ఊహించని విధంగా యాక్సిడెంట్(Accident) జరిగింది. ఇందారం టేకుమట్ల (Indaram Tekumatla)మూల మలుపు దగ్గర కారు స్పీడ్ కంట్రోల్‌ కాకపోవడంతో చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న నలుగురు ఫ్రెండ్స్ గాయపడ్డారు. ముందు భాగం డైరెక్ట్‌గా చెట్టుకు ఢీకొనడంతో డ్రైవర్ సీటు, దాని పక్కనే ఉన్న మరో సీటులో కూర్చున్న సాయి ప్రణీత్‌రెడ్డి (Saipraneeth Reddy), వాసు (Vasu)తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నలుగుర్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ప్రణీత్‌రెడ్డి, వాసు మృతి చెందారు. మరో ఇద్దరు ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.

ఫోటోల కోసం వెళ్తే..

ఎవరూ ఊహించని ఘోర ప్రమాదం ఇది. ఫ్రెండ్ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం మిగిలిన స్నేహితులు కలిసిన వెళ్లిన సమయంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కారు ముందు సీట్లలో కూర్చున్న వాసు, సాయి ప్రణీత్‌రెడ్డి తలకు బలమైన దెబ్బలు తగలడం వల్లే చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు. మృతుల్లో ఒకరు సాయిప్రణీత్‌రెడ్డి గోదావరిఖని జీఎం కాలనీలో నివాసముంటున్నారు. మరో వ్యక్తి వాసు మార్కండేయకాలనీ వాసిగా గుర్తించారు.

(స్నేహితుల ప్రాణం తీసిన ప్రమాదం)

ప్రాణాలే పోయాయి..

ఉగాది పండుగ రోజున..ప్రాణస్నేహితుడి పెళ్లి ఫోటోల కోసం బయల్దేరిన నలుగురు మిత్రుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం అందర్ని షాక్‌కి గురి చేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే నలుగురు స్నేహితులు బెల్లంపల్లి సమీపంలోని డిప్లమో కాలేజీలో ఫైనల్ ఈయర్ చదువుతున్నారు. స్నేహితుడి అందమైన పెళ్లి వేడుక కలకాలం గుర్తుండిపోవాలని కోరుకొని ఫోటోషూట్‌కి వెళ్లిన సమయంలో మృత్యువు రోడ్డు ప్రమాదంలో రూపంలో వెంటాడింది. నలుగురు ప్రాణస్నేహితుల్లో ఇద్దరు శాశ్వతంగా దూరమవడాన్ని మిగిలిన స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉగాది పండుగ ఈ దుర్ఘటన జరగడంతో మృతుల ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

First published:

Tags: Car accident, Mancherial

ఉత్తమ కథలు