(Lenin, News18, Adilabad)
చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యకు (Farmers suicide) పాల్పడిన రైతుల ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అయితే పంట సాగుకు (Crop Harvesting) అవసరమైన పెట్టుబడి కోసం ఎక్కడా అప్పు లభించక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు (Two farmers died) పాల్పడిన విషాదకర సంఘటన ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఖడ్కి గ్రామానికి చెందిన మడావి మారు అనే రైతులు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత సంవత్సరం అధిక వర్షలతో ఆశించిన పంట దిగుబడి రాలేదు. ఇదీకాక పోయిన సంవత్సరం చేసిన కూతురి పెళ్ళి కోసం అప్పు చేయాల్సి వచ్చింది. బ్యాంకు లో కూడా లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నాడు.
విత్తనాల కొనుగోలుకు డబ్బులు లేక..
ఈ యేడు వానాకాలం పంట సాగుకు విత్తనాలు, ఇతరత్ర అవసరాల కోసం డబ్బు అవసరమైంది. గతేడాది చేసిన బ్యాంకు రుణం (Bank loan) ప్రభుత్వం మాఫీ చేస్తుందని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు మళ్లీ రుణం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో పంట పెట్టుబడి కోసం అవసరమై అప్పు కోసం ప్రయత్నం చేసినప్పటికి ఎక్కడా అప్పు లభించలేదు. విత్తనాల కొనుగోలుకు డబ్బులు లేక మనస్థాపం చెందిన మడావి మారు తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.
ఇదిలా ఉంటే కొమురంభీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా కెరమెరి మండలం తుమ్మగూడకు చెందిన రాథోడ్ మోహన్ కూడా ఈ యేడు పంటసాగుకు అవసరమైన పెట్టుబడి కోసం అప్పుకోసం ప్రయత్నం చేశాడు. అప్పు లభించకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రాథోడ్ మోహన్ కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో గత సంవత్సరం పత్తి పంట సాగు చేశాడు. ఇందుకోసం రెండు లక్షల రూపాయల అప్పుతీసుకువచ్చాడు.
Fishermen Skill Test: అక్కడ మత్స్యకారుడికీ ఓ పరీక్ష ఉంటుంది తెలుసా.. పాసైతేనే మత్స్యకారుడిగా గుర్తింపు..
ఆశించిన పంట దిగుబడి రాక, సాగుకు చేసిన అప్పు చెల్లించలేకపోయాడు. ఈయేడు మళ్లీ వానాకాలం సాగు కోసం అప్పు కోసం ఎక్కడెక్కడో ప్రయత్నించాడు. కానీ ఎక్కడా అప్పు దొరకలేదు. ఇదే విషయం భార్యతో చెప్పుకుంటూ మదనపడ్డాడు. చివరకు మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Asifabad, Farmers suicide