తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఇందిరాపార్క్ వద్ద దీక్ష కొనసాగుతోంది. అయితే ఈ దీక్షలో పాల్గోన్న పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు ఇతర నేతలు రాత్రి కూడా అక్కడే పడుకుని ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.( Congress party Indirapark Dharna ) రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే రెండుత తర్వాత పార్లమెంట్ ప్రధాని మోదీ మెడలు వంచుతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ అన్నారు. వరిధన్యాం కొనుగోలు చేయకపోతే అటు కేంద్రంలో నరేంద్రమోదీని, రాష్ట్రంలో సీఎం కేసిఆర్‌ను నడిబజార్లో ఉరేసుడు ఖాయం అని హెచ్చరించారు. ( Congress party Indirapark Dharna )ధాన్యం కొనుగోలు చేయనప్పుడు అధికారం అనుభవించే హక్కు సీఎం కేసీఆర్‌కు లేదని అన్నాడు.
ప్రభుత్వానికి చేతన కాకుంటే కాంగ్రెస్ పార్టీకి పది వేల కోట్లు ఇస్తే.. రాష్ట్రంలో రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇచ్చి ప్రతి గింజను కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుందని సవాలు విసిరారు. అలా జరగకపోతే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా అడగదని అన్నారు. సీఎం కేసీఆర్‌కు చీము నెత్తురు ఉంటే కాంగ్రెస్ పార్టీ సవాలును స్వీకరించాలని డిమాండ్ చేశారు.
Bandi sanjay : సీఎం కుట్రలకు ఢిల్లీ చెక్ పెట్టింది.. కేసిఆర్ పతనం ఆరంభమైంది..
Aadilabad : చాలన్లు వేస్తున్నారని పోలీసుల ముందే..తన బైకుకు తానే నిప్పు..
ఈ క్రమంలోనే సీఎం ఢిల్లీ టూర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.( Congress party Indirapark Dharna ) సీఎం కేసిఆర్ ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏమి లేదని విమర్శించారు.. ఈ సంధర్భంగా సీఎంపై మండిపడ్డారు. సారాలో సోడా కలిపి ఇచ్చే మంత్రులకు వెంటేసుకుని సీఎం సీఎం కేసిఆర్ ఢిల్లీకి వెళ్లాడని, నాలుగు రోజుల పాటు పార్టీలో మునిగిన సీఎం కనీసం పీఎం వద్దకు వెళ్లలేదని దుయ్యబట్టారు. ( Congress party Indirapark Dharna ) ఓ వైపు ధాన్యం కల్లాలలో రైతులు తమ ప్రాణాలను కోల్పోతుంటే సీఎం కేసిఆర్ మాత్రం పార్టీల్లో మునిగిపోయారని అన్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indirapark, Revanth Reddy