TWO CRORES OF RUPEES TRAFFIC CHALLAN MONEY COLLECTED IN A WEEK BY HYDERABAD POLICE VRY BK
Hyderabad : వాహనదారులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్ పోలీసులు! నిలబెట్టి కోట్ల డబ్బు వసూలు...
ప్రతికాత్మక చిత్రం
Hyderabad : హైదరాబాద్ పోలీసులు గత కొద్ది రోజులుగా పెండింగ్ చాలన్లపై దృష్టిసారించిన విషయం తెలిసిందే.. ఓ వైపు ఉల్లంఘనలపై దృష్టి సారిస్తూనే.. మరోవైపు వాటి వసూలుపై ఫోకస్ పెట్టారు.. దీంతో కేవలం వారం రోజుల్లోనే రెండు రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం.
వారం రోజుల్లో ఎన్ని చాలన్లో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్ వాహనదారులు అరుదైన రికార్డు సృష్టించారు. అది అలాంటి ఇలాంటి రికార్డు కాదు. కేవలం వారం రోజుల్లోనే దాదాపు 2 కోట్ల ట్రాఫిక్ చాలన్లు కట్టి రికార్డు క్రియేట్ చేశారు. కేవలం వారంలో రోజల్లోనే ఇన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కావడం అధికారులను కూడా ఆశ్చర్యనికి గురిచేస్తోంది. జనవరి 15 నుంచి 21వ వరకు కేవలం వారం రోజుల్లోనే రాచకొండ ట్రాఫిక్ పోలీసులు 39 వేలకు పైగా కేసులు నమోదు చేయగా, ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై మొత్తం రూ.1.70 కోట్ల జరిమానా రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ల దగ్గర నుంచి వసూళు చేశారు.
కేర్లేస్ డ్రైవింగ్, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి కేసులు ఈ వారం రోజుల్లో పెద్ద సంఖ్యలో నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ వారం రోజుల్లో మొత్తం 39,858 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు వివిధ ఉల్లంఘనల కోసం నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులుగాను దాదాపు రూ.1,75,58,415 జరిమానా విధించబడ్డాయి. ఈ వారం రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా భారీగానే నమోదు అయినట్లు పోలీసుల డేటా చెబుతుంది. ఈ కేసుల్లో బుక్ చేయడ్డవాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చి దాదాపు 118 మందిని కోర్టులో హాజరుపరచగా, మొత్తం రూ.3.40 లక్షల జరిమానా, ఒకరికి జైలుశిక్ష విధించినట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గత వారం రోజుల్లో మొత్తం 78 రోడ్డు ప్రమాదాలు జరగగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, స్కిడ్డింగ్ వంటి వాటి వల్లే ఎక్కు ప్రమాదాలు జరుగుతున్నాయని రాచకొండ ట్రాఫిక్ పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే ఇన్ని కేసులు నమోదు అవడంపై అధికారు దృష్టిపెట్టారు. వాహనదారులకు అవగాహాన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు చలాన్లు ను కూడా కఠినతరం తరం చేయాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిటీలో రాష్ డ్రైవింగ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడంపై దృష్టిపెట్టారు.
అంతే కాకుండా భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. డ్రంకెన్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ కేసులను తగ్గించడంపై అధికారులు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి గతంలో ఎన్నడు లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో చలాన్లు వసూళ్లు చేయడంపై అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.