TWO CHILDREN ORPHANED BY MOTHER DISAPPEARANCE IN MEDAK DISTRICT SNR MDK
Medak:నాన్న లేడు..అమ్మ రాదు..అయోమయంలో అనాధలైన ఇద్దరు పసివాళ్లు
(నాన్న లేడు..అమ్మ ఏమైదో తెలియదు)
OMG:బిడ్డలకు తల్లిదండ్రులు రెండు కళ్లతో సమానం. ఏ ఒక్కరు దూరమైన తట్టుకోలేరు. అలాంటిది కొద్ది రోజుల క్రితం తండ్రి చనిపోయి..ఇప్పుడు తల్లి కనిపించకుండా పోవడంతో ఆ ఇద్దరు బిడ్డలు అనాధలుగా మిగిలిపోయారు.
(K.Veeranna,News18,Medak)
కొందరి జీవితాలు చూస్తుంటే దేవుడు కూడా దయలేని వాడే అనాల్సి వస్తుంది. లోకజ్ఞానం తెలియని ఇద్దరు పసివాళ్లు అనాధలయ్యారు. చూడగానే ముద్దొచ్చెలా ఉన్నారు ఇద్దరు మగపిల్లలు. తండ్రి గతేడాది అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి కనిపించకపోయింది. ఇద్దరూ లేక అనాధలైన పిల్లలు దిక్కులు చూస్తున్నారు. ఎంతటి కఠినాత్ముల మనుసునైనా కరిగించే ఈ ఘటన మెదక్(Medak) జిల్లాలో చోటుచేసుకుంది. మనోహరాబాద్(Manoharabad)మండలం రామాయపల్లి (Ramayapalli)జక్కుల నాగరాజు(Nagraju) విమల(Vimala)దంపతుల పిల్లలే ఇప్పుడు తల్లిదండ్రులు లేని అనాధలయ్యారు. నాగరాజు గత ఏడాది డిసెంబర్(December) 8న అనారోగ్యంతో చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత తన ఇద్దరు బిడ్డలైన 10ఏళ్ల హర్షవర్ధన్ (Harshavardhan)8నెలల హేమంత్ (Hemanth)ని పోషించుకుంటూ రామాయపల్లిలోనే జీవిస్తోంది విమల.
అనాధలైన పసివాళ్లు..
ఈ నెల 5 ఉదయం విమల తన బిడ్డలు ఇద్దర్ని ఇంట్లో ఉంచి బయటకు వెళ్లింది. ఇంతవరకు తిరిగి రాలేదు. విమల అదృశ్యం కావడంతో ఆందోళన చెందిన నాగరాజు తండ్రి అంజయ్య బంధువుల ఇళ్లలో వెదికాడు. ఆమె జాడ కోసం గాలించాడు. ఆచూకి దొరక్కపోవడంతో మంగళవారం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు నాగరాజు తండ్రి అంజయ్య. ఇదంతా తెలియని పసివాళ్లు రెండు వారాలు గడుస్తున్నా ఇంకా తమ తల్లి కనిపించకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. పిల్లలు తల్లిని వెదుకుతూ చూస్తున్న జాలి చూపులకు స్థానికులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసివాళ్లను వదిలివెళ్లిన ఆ తల్లి ఎక్కడుందో కాని..బిడ్డలు మాత్రం పసి వయసు నుంచే తల్లిదండ్రులు లేని అనాధలుగా మిగిలిపోయారంటున్నారు.
తల్లి కోసం దిక్కులు చూస్తున్న బిడ్డలు..
తండ్రి చనిపోయి..తల్లి వదిలివెళ్లడంతో అనాధలైన హర్షవర్ధన్, హేమంత్ అనే ఇద్దరు పసివాళ్లను నాగరాజు తల్లిదండ్రులు పసివాళ్ల నాయనమ్మ, తాతయ్యలైన అంజయ్య, సుగుణమ్మ దగ్గరే ఉన్నారు. బిడ్డల్ని వదిలి వెళ్లిన మహిళ ఆచూకి ఇంత వరకు దొరక్కపోవడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె జాడ కనుక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐదు నెలల క్రితం కొడుకు చనిపోవడం, రెండు వారాల క్రితం కోడలు అదృశ్యమవడం, ఇంకా లోకజ్ఞానం కూడా తెలియని ఇద్దరు మనవళ్లు అనాధలుగా మారడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న తాత, నాయనమ్మ తట్టుకోలేకపోతున్నారు.
ఎవరూ తీర్చలేని కష్టం..
విమల అదృశ్యమవడం వెనుక ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భర్త చనిపోయిన ఐదు నెలలకే బిడ్డల ఆలనా, పాలన చూడటం భారంగా అనిపించే ఎటైనా వెళ్లిందా లేక ఏమైనా చేసుకుందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. తండ్రి లేక తల్లి దూరమైన బిడ్డలను చూస్తుంటే ఏడుపొస్తోందంటున్నారు గ్రామస్తులు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.