#TSRTCStrike : చక్రాలకు బోల్టులు బిగించకుండానే బయలుదేరిన బస్సు.. ప్రయాణికుల భయాందోళన

TSRTCStrike : ఇప్పటికిప్పుడు విధుల్లో చేరుతున్న ప్రైవేట్ డ్రైవర్లకు బస్సుల కండిషన్‌పై అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందంటున్నారు.

news18-telugu
Updated: October 6, 2019, 3:59 PM IST
#TSRTCStrike : చక్రాలకు బోల్టులు బిగించకుండానే బయలుదేరిన బస్సు.. ప్రయాణికుల భయాందోళన
బస్ స్టేషన్‌లో పోలీసులు (File Photo)
news18-telugu
Updated: October 6, 2019, 3:59 PM IST
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ డ్రైవర్లతో పాక్షికంగా బస్సులు నడిపిస్తోంది ప్రభుత్వం.అయితే బస్సు కండిషన్‌ చెక్ చేయకుండానే కొంతమంది డ్రైవర్లు వాటిని డిపోల నుంచి తీసుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.సంగారెడ్డి డిపోకి చెందిన రెండు బస్సుల చక్రాల బోల్టులను సరిగా బిగించకుండానే డ్రైవర్లు బయటకు తీసుకొచ్చారు. డిపో గేటు వద్ద ఉన్న ఆర్టీసీ కార్మికులు విషయాన్ని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.దాంతో బస్సులను వెనక్కి పంపించి బోల్టులను బిగించారు. ఇప్పటికిప్పుడు విధుల్లో చేరుతున్న ప్రైవేట్ డ్రైవర్లకు బస్సుల కండిషన్‌పై అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. మరోవైపు కొత్త డ్రైవర్లు బస్సులు నడుపుతుండటంతో ప్రయాణికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. భద్రత విషయంలో అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

First published: October 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...