చెరువులో శవాల మిస్టరీ.. ఓ మృతదేహం బయటపడిన 24 గంటల్లోనే నీళ్లపై తేలాడిన రెండో శవం..!

మరణించిన ఇద్దరు బాలురు (ఫైల్ ఫొటోలు)

ఆ ఊళ్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఒకదాని తర్వాత మరొకటిగా బయటడిన మృతదేహాలు. చెరువులోంచి ఓ మృతదేహం బయటపడిన 24 గంటల్లోనే మరో శవం బయటపడింది. అసలేం జరిగింది? వాళ్లిద్దరూ ఎలా మరణించారు?

 • Share this:
  ఆ ఊళ్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఒకదాని తర్వాత మరొకటిగా బయటడిన మృతదేహాలు. చెరువులోంచి ఓ మృతదేహం బయటపడిన 24 గంటల్లోనే మరో శవం బయటపడింది. అసలేం జరిగింది? వాళ్లిద్దరూ ఎలా మరణించారు? అన్న దాని గురించే ఆ ఊళ్లో చర్చ జరుగుతోంది. బహిర్భూమికని వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెరువులో శవాలుగా తిరిగి కనిపించడం పట్ల ఆ రెండు కుటుంబాల్లో విషాధ ఛాయలు అలముకున్నాయి. కనిపించకుండా పోయిన వాళ్లిద్దరి కోసం అన్ని చోట్లా వెతికారు. అయినా ఆ పిల్లలిద్దరూ మళ్లీ తిరిగొస్తారని ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబాల్లో అంతులోని దు:ఖాన్ని నింపింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన వడ్ల ఆంజనేయులు అనే 10 సంవత్సరాల బాలుడు, జెట్టి బన్నీ అనే మరో 11 సంవత్సరాల బాలుడు ఇద్దరు మంచి స్నేహితులు. అయితే ఆంజ‌నేయులు కాల‌కృత్యాలు తీర్చుకునేందుకు చెరువు గ‌ట్టుకు వెళుతున్నాడు. అప్పుడే దారిలో బ‌న్నీ క‌లిశాడు. బ‌న్నీకి విష‌యం చేప్పి ఇద్దరూ కలిసి బహిర్భూమికని గ్రామ శివారులోని చెరువుకుంటకు మంగ‌ళవారం సాయంత్రం వెళ్లారు. చిక‌టి ప‌డినా ఇంటికి రాలేదు. వారి కోసం త‌ల్లిదండ్రులు గాలించారు. కానీ ఎక్కడా క‌నిపించాలేదు. బుధవారం ఉద‌యం ఆంజ‌నేయులు మృతదేహం చెరువు కుంట‌లో తేలుతూ కనిపించింది. దీంతో స్థానికులు చూసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

  ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

  పోలీసులు సంఘ‌టనా స్థలానికి చేరుకుని ఆంజ‌నేయులు మృతదేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. అయితే మ‌రో బాబు బ‌న్నీ కొసం గ‌జ ఈత‌గాళ్లతో చెరువు కుంటను జ‌ల్లెడ ప‌ట్టారు. అయినప్పటికీ బ‌న్నీ ఆచూకి తెలియరాలేదు. చీక‌టి ప‌డ‌డంతో ఉయ‌దం వెతుకుతామ‌ని పోలీసులు చెప్పారు. అయితే గల్లంతైన జట్టి బన్నీ మృతదేహం గురువారం వేకువజామున చెరువులోనే లభ్యమైంది. దీంతో అంతంప‌ల్లి గ్రామంలో విషాద‌ ఛాయాలు అలుముకున్నాయి. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు బోరున విలపిస్తోంటే.. ఆ దృశ్యాలను చూసి స్థానికులు కంట‌త‌డి పెట్టుకుంటున్నారు. గురువారం పైకి తేలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
  ఇది కూడా చదవండి: నా డబ్బు.. నా ఇష్టమంటూ.. 60 ఏళ్ల వృద్ధ డాక్టర్ నిర్వాకం.. అమ్మాయిలతో చాటింగ్ కోసం రూ.70 లక్షలు..!
  Published by:Hasaan Kandula
  First published: