TVS MOTOR COMPANY OFFERS SERVICE FOR ALL FLOOD AFFECTED TVS CUSTOMERS IN TELANGANA SK
TVS free Service: వరద నీటితో మీ బైక్ పాడయిందా..? ఉచిత రిపేర్ సర్వీస్ పొందండి ఇలా..
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ వ్యాప్తంగా అక్టోబరు 29 నుంచి నవంబరు 4 వరకు ఫ్రీ సర్వీస్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇన్సూరెన్స్ లేని బైకులకు ఎలాంటి లేబర్ చార్జీ లేకుండా మరమ్మతులు చేయనున్నారు.
రెండు వారాల క్రితం హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా వరుణుడు విజృంభిచడంతో విశ్వనగరం విలవిల్లాడింది. ఎడతెరిపి లేని వానలతో నగరంలో చాలా ప్రాంతాలు వరద ముంపులో ఉండిపోయాయి. రోడ్లన్నీ కాల్వలను తలపించాయి. కాలనీలు చెరువులుగా మారాయి. మూసీ నది ఉప్పొంగడంతో నది చుట్టు పక్కల ప్రాంతాల రోజుల తరబడి నీట మునిగాయి. వరద నీటితో కార్లు, బైక్‌లు కొట్టుకుపోయాయి. నీట మునిగి ఎన్నో వాహనాలు పాడైపోయాయి. ఇప్పటికీ సర్వీస్ సెంటర్లకు క్యూకడుతున్నాయి. ఈ క్రమంలో టీవీఎస్ కంపెనీ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వరద నీటి కారణంగా పాడైన వాహనాలకు ఉచితంగా మరమ్మత్తులు చేస్తామని ప్రకటించింది.
కస్టమర్లే తమకు మొదటి ప్రాధాన్యత అని.. అందుకే వరదలతో నష్టపోయిన వారికి ఉచిత రిపేర్ సర్వీస్‌ను అందజేస్తున్నట్లు టీవీఎస్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అక్టోబరు 29 నుంచి నవంబరు 4 వరకు ఫ్రీ సర్వీస్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇన్సూరెన్స్ లేని బైకులకు ఎలాంటి లేబర్ చార్జీ లేకుండా మరమ్మతులు చేయనున్నారు. ఉచితంగా విహికల్ చెకప్ చేసి అవసరమైన రిపేర్ చేస్తారు. ఐతే విడిభాగాలు, ఇంజిన్ ఆయిల్, లూబ్రికెంట్స్ చార్జీలను మాత్రం వసూలు చేస్తారు. అంతేకాదు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను త్వరగా క్లియర్ చేసేందుకు గాను పలు ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.
వినియోగదారులు తమ బైకులను తీసుకొని సమీపంలో ఉన్న టీవీఎస్ షోరూం వెళ్లాల్సి ఉంటుంది. ఐతే వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన బైక్‌లను ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయవద్దని సూచిస్తోంది. లేదంటే ఇంజిన్ దెబ్బతినే అవకాశముందని తెలిపింది. మరింత సమాచారం కోసం 7337009958 / 9121177261 లేదా Surabhi.udas@tvsmotor.com, Priyanka.b@tvsmotor.com సంప్రదించాలని వెల్లడించింది. కస్టమర్లు ఈ సేవలను వినియోగించుకోవాలని టీవీఎస్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.