హోమ్ /వార్తలు /తెలంగాణ /

పోలీసుల ఎదుట హాజరైన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్...

పోలీసుల ఎదుట హాజరైన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్...

పోలీసుల ఎదుట హాజరైన రవిప్రకాశ్

పోలీసుల ఎదుట హాజరైన రవిప్రకాశ్

ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో రవిప్రకాశ్ పోలీసుల ఎదుట హాజరైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీవీ 9 సీఈవోగా రవిప్రకాశ్ ను తొలగించినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం రెండు సార్లు పిటిషన్ సైతం దాఖలు చేశారు. అయితే సుప్రీం కోర్టు బెయిల్ అంశం హై కోర్టులోనే తేల్చుకోవాలని సూచించండంతో పాటు, అరెస్టుకు 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం సూచించింది.

ఇంకా చదవండి ...

    టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఎట్టకేలకు సైబరాబాద్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. నకిలీ, ఫోర్జరీ పత్రాల కేసులో రవిప్రకాశ్ పై అలంద మీడియా ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రవిప్రకాశ్ సైబరాబాద్ క్రైం పోలీసుల ముందు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో రవిప్రకాశ్ పోలీసుల ఎదుట హాజరైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీవీ 9 సీఈవోగా రవిప్రకాశ్ ను తొలగించినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం రెండు సార్లు పిటిషన్ సైతం దాఖలు చేశారు. అయితే సుప్రీం కోర్టు బెయిల్ అంశం హై కోర్టులోనే తేల్చుకోవాలని సూచించండంతో పాటు, అరెస్టుకు 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం సూచించింది.


    ఇదిలా ఉంటే రవిప్రకాశ్ పోలీసులు రెండు సార్లు నోటీసులపై ఇప్పటికే రెండు సార్లు గైర్హాజరయ్యారు. రవిప్రకాశ్ పై సంతకం ఫోర్జరీ, నిధుల మళ్లింపు, లోగో కాపీరైట్ కు సంబంధించిన అక్రమ అగ్రిమెంట్ లపై టీవీ9 యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బెయిల్ దారులన్నీ మూసుకుపోవడంతో రవిప్రకాశ్ పోలీసుల ఎదుట హాజరుకావాల్సిన పరిస్థితి తప్పలేదు.


    First published:

    Tags: Ravi prakash, TV9