• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • TV9 EX CEO RAVI PRAKASH GETS ANTICIPATORY BAIL IN ED CASE FROM HIGHCOURT SK

ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌కు ఊరట..

రవి ప్రకాష్ (Image : Twitter)

రవిప్రకాశ్‌‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా ఉపసంహరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

  • Share this:
    ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి రవిప్రకాశ్‌‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా ఉపసంహరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే మధ్య ఈ డబ్బును తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు 2019 అక్టోబర్‌లో కేసు నమోదైంది. దాని ఆధారంగా ఈడీ వర్గాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ నమోదు చేశాయి.

    ఐతే ఈడీ కేసులో తనను అరెస్టు చేయకుండా బెయిల్‌ మంజూరు చేయాలని రవిప్రకాశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారించిన తెలంగాణ హైకోర్టు.. ఆయనకు శుక్రవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, ప్రతి శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చునని ఈడీకి అనుమతి ఇచ్చింది హైకోర్టు.
    Published by:Shiva Kumar Addula
    First published: