చిలుకూరులో అద్భుతం.. ఇదే శుభ సంకేతమంటున్న ప్రధాన అర్చకులు..

కూర్మమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తున్న పూజారులు

ఇప్పుడు కూడా కోవిడ్-19ను జయించేందుకు విశ్వమంతా ప్రయత్నం చేస్తున్నదని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ తెలిపారు.

 • Share this:
  కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలోనూ రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఖచ్చితమైన మెడిసన్ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో చిలుకూరులో దేవాలయంలో అద్భుతం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున చిలుకూరు బాలాజీ దేవాలయం లోపల ఉన్న శివాలయంలో ఒక తాబేలు(కూర్మమూర్తి) ఎక్కడి నుంచో కనిపించింది. అయితే తాబేలు ఎక్కడ్నుంచి ప్రవేశించిందనేది అంతుచిక్కడం లేదు. వాస్తవానికి తాబేలు ప్రవేశించడానికి దారి లేదు.Turtle, Chilukur, Temple, Corona Virus, Kovid-19, Telangana, Hyderabad, తాబేలు, చిలుకూరు, ఆలయం, కరోనా వైరస్, కోవిడ్-19, తెలంగాణ, హైదరాబాద్,

  దాదాపు పది సెంటీ మీటర్ల పొడవు, ఆరు సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ తాబేలు ఎలా ప్రవేశించిందో ఆశ్చర్యంగా ఉందని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం తెలిపారు. తాబేలు(కూర్మమూర్తి) ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తోందని, పూర్వం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మావతారం పైనే మేరు పర్వతాన్ని ఉంచి వాసుకి అనేటటువంటి సర్పంతో ఒకవైపు దేవతలు.. మరోవైపు అసురులు మదించారు. ఇప్పుడు కూడా కోవిడ్-19ను జయించేందుకు విశ్వమంతా ప్రయత్నం చేస్తున్నదని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ తెలిపారు. సాగర మథనంలో హాలాహలం వచ్చిందని, దాన్ని పరమశివుడు మింగాడు.

  అలాగే ఈరోజు చిలుకూరులో సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో కూర్మం ప్రత్యక్షమవడం అంటే ఆ వెంకటేశ్వర స్వామి మనకు త్వరలో ఈ లోకం నుంచి కరోనా వైరస్ అంతమై.. అమృతం లభించేలా సూచనలు కన్పిస్తున్నాయని రంగరాజన్ పేర్కొన్నారు. భక్తులు చేసేటటువంటి ప్రార్థనలు, డాక్టర్లు చేసే ప్రయత్నాలు, ప్రభుత్వ ప్రయత్నాలు అన్నింటికీ తొందరలో మంచి ఫలితం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో పాటు ఆరుద్ర నక్షత్రమని ప్రధాన పూజారి రంగరాజన్ తెలిపారు.
  Published by:Narsimha Badhini
  First published: