నిజామాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. రైతుల కళ్ల ముందే బుగ్గిపాలైన పసుపు..

నిజామాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. రైతుల కళ్ల ముందే బుగ్గిపాలైన పసుపు..

ప్రతీకాత్మక చిత్రం

నిజామాబాద్ జిల్లాలో దాదాపు రూ.75 లక్షల విలువ చేసే పసుపు మంటల్లో మసైంది. లారీ డీజిల్ లీకై, మంటలు అంటుకొని పసుపంతా బుగ్గి పాలైంది.

  • Share this:
    పంట చేతికొచ్చింది.. అమ్ముకుంటే పైసలొస్తయని ఆశపడ్డరు ఆ రైతన్నలు.. మార్కెట్‌కు తీసుకుపోదమని పది మంది కలిసి ఓ లారీ మాట్లాడుకున్నరు.. పసుపు బస్తాలన్నీ లారీలో ఎక్కించిండ్రు.. లారీ బయల్దేరుతుంటే ఖుషీ అయ్యిర్రు.. కానీ, ఆ సంతోషం నిమిషాల్లోనే ఆవిరైంది. లారీ డీజిల్ లీకై, మంటలు అంటుకొని పసుపంతా బుగ్గి పాలైంది. కళ్లముందే ఆనందం ఆవిరైపోయింది. దాదాపు రూ.75 లక్షల విలువ చేసే పసుపు మంటల్లో మసైంది. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కూడా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మెండోరా మండలం వెల్గటూర్‌కు చెందిన రైతులు.. తాము పండించిన పసుపును నిజామాబాద్‌లోని మార్కెట్‌ యార్డుకు లారీలో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. సరుకు ఎక్కించుకొని లారీ తీసుకెళ్తుండగా.. ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో లారీలో మంటలు అంటుకున్నాయి.

    లారీలో ఉన్న మొత్తం పసుపు బస్తాలతో పాటు.. లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. లారీలో ఉన్న డ్రైవర్ సుధాకర్, క్లీనర్ అజయ్ కూడా మంటలు తాకి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాయకష్టం చేసి, చెమటోడ్చి పండించిన పంట కళ్లముందే మసై పోతుంటే రైతన్న కన్నీరు ఆగలేదు. లారీలో మొత్తం 350 బస్తాలు ఉండగా, ఒక్కో బస్తా రూ.5 వేల విలువ చేస్తుందని రైతులు వెల్లడించారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: