పసుపు పంటకు మద్దతు ధర 15వేల రూపాయలు ప్రకటించాలని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పసుపు రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆర్మూర్ 44వ జాతీయ రహదారిపై రైతులు బైటాయించి ధర్నా చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పసుపు పంట చేతికి వచ్చి మార్కేట్ లో ధరలు లేక రైతులు నష్టపోతున్నామనీ, పసుపు పంటకు ఎంఎస్పీ ప్రకటించాలని డిమాండ్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మరో పంజాబ్ రైతులుగా మారుతామని రైతులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పసుపును ఎక్కువగా పండిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 30 వేల ఎకరాల్లో పసుపు పంటను సాగు చేశారు. దిగుబడి ఎక్కువగా ఉండేసరికి పసుపు ధరను వ్యాపారులు పూర్తిగా తగ్గించేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు హైవేపై ధర్నా నిర్వహించారు.
పసుపు బోర్డును ఎర్పాటు చేస్తే మద్దతు ధర లభిస్తుందని రైతులు ఆశించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుత ఎంపి ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బాండ్ పేపర్ పై హామీ రాసిచ్చారు కూడా. ఆ ఎన్నికల్లో పసుపు రైతులు ధర్మపురి అర్వింద్ కు అండగా నిలిచారు. సీఎం కేసీఆర్ కుమార్తెను ఓడించి మరీ అర్వింద్ ను గెలిపించారు. కానీ ఇప్పటికి పసుపు బోర్డు రాలేదు. దీంతో రైతులు మరో సారి ఉద్యమానికి సిద్దమయ్యారు. శనివారం ఆర్మూర్ లోని 44వ జాతీయ రహదారిపై బైటయించి రైతులు ఆందోళన చేస్తున్నారు.
రైతులు ఆందోళనలు చేసినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా ధరలు పెంచి రైతులను తాత్కాలికంగా ఓదార్చుతున్నారు. కానీ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు.. అంటూ పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పంటలు వేయకముందే పసుపునకు కనీస మద్ధతు ధర ఎంత ఉంటుందనేది ప్రకటించాలని రైతులు డిమాండ్ చేసారు. పంట వేసిన తరువాత ధర నిర్ణయిస్తే రైతులు నష్టపోతున్నారని వాపోయారు.. గత వర్షాకాలం సన్నరకం వడ్లు పండిస్తే ధర లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా పసుపు రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని లేదంటే మరో పంజాబ్ రైతు ఉద్యమం ఆవుతుందని వారు హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dharmapuri Arvind, Nizamabad, Telangana