Home /News /telangana /

TSSPDCL TSNPDCL CENTRAL GOVT GIVES CLARITY ON TELANGANA DISCOMS NON PAYMENT OF DUES TO GENCOS SK

Telangana: రాత్రికి రాత్రే మారిన లెక్కలు.. తెలంగాణ బకాయిలపై తప్పులో కాలేసిన కేంద్రం

Telangana: డిస్కంలు ఏదైనా విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ కొంటే 45 రోజుల్లోగా డబ్బు చెల్లించాలి. ఈ గడువు దాటితే ఆలస్యం చెల్లింపు జరిమానా కట్టాలని కేంద్రం ఆదేశాలున్నాయి. వీటి కిందనే తెలంగాణ డిస్కంలు రూ.52.85 కోట్ల తెలంగాణ డిస్కంలు కట్టాలని స్పష్టం చేసింది.

Telangana: డిస్కంలు ఏదైనా విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ కొంటే 45 రోజుల్లోగా డబ్బు చెల్లించాలి. ఈ గడువు దాటితే ఆలస్యం చెల్లింపు జరిమానా కట్టాలని కేంద్రం ఆదేశాలున్నాయి. వీటి కిందనే తెలంగాణ డిస్కంలు రూ.52.85 కోట్ల తెలంగాణ డిస్కంలు కట్టాలని స్పష్టం చేసింది.

Telangana: డిస్కంలు ఏదైనా విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ కొంటే 45 రోజుల్లోగా డబ్బు చెల్లించాలి. ఈ గడువు దాటితే ఆలస్యం చెల్లింపు జరిమానా కట్టాలని కేంద్రం ఆదేశాలున్నాయి. వీటి కిందనే తెలంగాణ డిస్కంలు రూ.52.85 కోట్ల తెలంగాణ డిస్కంలు కట్టాలని స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    విద్యుదుత్పత్తి సంస్థలకు (Power Generation Companies) బకాయిలు చెల్లించలేదన్న కారణంతో.. ఇంధన ఎక్స్‌చేంజిలో తెలంగాణ (Telangana) సహా పలు రాష్ట్రాల విద్యుత్ అమ్మకాలు, కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. కేంద్ర వెల్లడించిన లెక్కల్లో అన్ని తప్పులే ఉన్నాయని పలు రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో బకాయిల లెక్కల సరిచూసిన కేంద్రం.. తప్పులను సవరించింది. ఏపీ సహా ఆరు రాష్ట్రాలు సమర్పించిన లెక్కలు సరిచూశాక వాటిపై నిషేధాన్ని తొలగించింది. ఐతే తెలంగాణ మాత్రం బకాయి ఉందని నిషేధాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణ డిస్కంలు ఆగస్టు 18 నాటికి బకాయిలపై 'ఆలస్య రుసుం సర్ఛార్జి' (LPS) రూ.52.85 కోట్లు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ సొమ్మును చెల్లిస్తేనే విద్యుత్ కొనేందుకు అనుమతిస్తామని తెలిపింది.

    Asaduddin Owaisi : రాజకీయ లబ్ది కోసమే బీజేపీ బిల్కిస్‌ బానొ కేసులో దోషుల్ని విడిచిపెట్టింది : అసదుద్దీన్ ఓవైసీ

    తెలంగాణ డిస్కంలు (TSSPDCL, TSNPDCL) దేశవ్యాప్తంగా జెన్కోలకు రూ. 1960 కోట్ల మేర బకాయి పడ్డాయంటూ గురువారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ బకాయిలను చెల్లించనందున విద్యుత్ కొనుగోళ్లు, అమ్మకాలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. ఐతే కేంద్రం లెక్కలు తప్పుల తడకగా ఉందని పలు కేంద్రాలు విమర్శించడంతో.. దానిపై మరోసారి లెక్కలు చేసింది. అనంతరం బకాయిలను సవరించింది. రాత్రి రాత్రే లెక్కలను మార్చింది. తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సింది 1960 కోట్లు కాదని.. కేవలం 52.85 కోట్లేనని స్పష్టం చేసింది. ఆ బకాయిలు కడితేనే నిషేధం ఎత్తివేస్తామని స్పష్టం చేసింది. తాము ఎవరికీ ఒక్క రూపాయి కూడా కట్టకుండానే.. ఒక్క రోజులో బకాయిలు ఎలా తగ్గిపోయాయని.. తెలంగాణ డిస్కంలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. ఐతే ఇప్పటికే చెల్లించిన డబ్బు లెక్కలను సరిచూడకపోవడం వల్లే తేడాలొచ్చాయని కేంద్ర సమాధానం చెప్పింది.

    డిస్కంలు ఏదైనా విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ కొంటే 45 రోజుల్లోగా డబ్బు చెల్లించాలి. ఈ గడువు దాటితే ఆలస్యం చెల్లింపు జరిమానా కట్టాలని కేంద్రం ఆదేశాలున్నాయి. వీటి కిందనే తెలంగాణ డిస్కంలు రూ.52.85 కోట్ల తెలంగాణ డిస్కంలు కట్టాలని స్పష్టం చేసింది. ఐతే ఈ బకాయిల లెక్కలని మరోసారి సరిచూడాలని.. తాము అంత బకాయి పడలేదని డిస్కంలు వాదిస్తున్నాయి. కేంద్రం నుంచి సరైన విధంగా స్పందన రాకుంటే.. కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాయి. కేంద్రం నిషేధం విధించడంతో.. భారత ఇంధన ఎక్స్‌ఛేంజి (IEX) నుంచి తెలంగాణ విద్యుత్ కొనలేకపోతోంది. శుక్రవారం 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనలేకపోయింది. శనివారం కూడా అనుమతి వస్తుందో రాదో తెలియదు. ఈ నేపథ్యంలో రానున్న ఒకటి రెండు రోజుల్లో విద్యుత్ కోతలు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



    కాగా, విద్యుత్ కొనుగోళ్ల బకాయిలను చెల్లించలేదన్న కారణంతో.. ఏపీ సహా 13 రాష్ట్రాల డిస్కంలపై కేంద్రం గురువారం నిషేధిం విధించింది. ఐతే లెక్కల్లో తేడాలున్నాయని అభ్యంతరాలు రావడంతో.. వాటిని మరోసారి సరిచూసింది కేంద్రం. అనంతరం ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఝార్ఖండ్, మణిపూర్‌ సమర్పించిన లెక్కలపై స్పష్టత రావడంతో... ఆయా రాష్ట్రాలపై నిషేధం విధించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Power cuts, Telangana, TSSPDCL

    తదుపరి వార్తలు