గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం వేసవికాలంలో కరెంట్ వాడకం పెరిగిందని టీఎస్ ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ మూలన ఎక్కడకు వెళ్ళకుండా ఇండ్లలోనే ఉన్నారు కాబట్టి విద్యుత్ వినియోగం పెరిగిందని అన్నారు. 3 నెలల పాటు ఇంట్లోనే ఎక్కువగా ఉన్నారు కాబట్టి బిల్ ఎక్కువగా వచ్చిందని తెలిపారు. ఈ నెలలో ఎక్కువ బిల్ వచ్చినట్లు అయితే వచ్చే నెల బిల్ లో కూడా అడ్జెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. దీనిపై తమకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని... వాటిని పరిశీలించి వివరణ ఇచ్చామని అన్నారు. మార్చి లో 67 శాతం వినియోగదారులు మాత్రమే బిల్ కట్టారని... ఏప్రిల్ నెలలో 44 శాతం, మే నెలలో68 శాతం మాత్రమే బిల్ పే చేశారని అన్నారు. మొత్తం యావరేజ్‌గా 60 శాతం మాత్రమే బిల్లు చెల్లించారని అన్నారు.
తాము ఎక్కడ కూడా విద్యుత్ బిల్ పెంచడం లేదన్న రఘుమారెడ్డి... ఉన్న టారిఫ్‌లో మాత్రమే ఇస్తున్న బిల్లులు వస్తున్నాయని అన్నారు. వేసవి కాలంలో స్లాబ్ మారితే బిల్ చేంజ్ అవుతుందని తెలిపారు. వేసవికాలంలో 13 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుందని...దీంతో స్లాబులు మారి బిల్ పెరుగుతుందని చెప్పారు. ఈఆర్సీ అప్రూవల్ తీసుకునే బిల్లు ఇచ్చామని అన్నారు. మార్చి,ఏప్రిల్ ,మే నెలలో వినియోగదారులు ఎంత విద్యుత్ వాడుకున్నారనే దానిపై తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana