ఆర్టీసీ కార్మికులు ఇవాళ సమ్మె విరమించే ఛాన్స్...

ఆర్టీసీ కార్మికులు ఇవాళ సమ్మె విరమించే ఛాన్స్...

అశ్వత్థామరెడ్డి

TSRTC Strike : ఆర్టీసీ కార్మికులు నేడు చేయాలనుకున్న సడక్ బంద్‌ను వాయిదా వేసుకున్నారు. సమ్మె విషయంలో నేటి సాయంత్రం ఫైనల్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

 • Share this:
  TSRTC Strike : ఆర్టీసీ సమ్మెపై తాము చెప్పేది ఏదీ లేదన్న తెలంగాణ హైకోర్టు విషయాన్ని లేబర్ కోర్టుకు రిఫర్ చెయ్యమని ప్రభుత్వానికి చెప్పడంతో... కార్మికులు చిక్కుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే... ఎస్మా ప్రయోగించడమో, ఉద్యోగాల నుంచీ తొలగించడమో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని లేబర్ కోర్టు ఆదేశిస్తే... అందరి జీవితాలూ రోడ్డున పడే ప్రమాదం ఉందని జేఏసీ నాయకులు భావిస్తున్నారు. సోమవారం నిరాహార దీక్ష విరమించిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామనీ... సమ్మె విషయంలో నేటి సాయంత్రం ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదనీ... ఆ తీర్పుపై ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చించి సమ్మెపై ఫైనల్ ప్రకటన చేస్తామని తెలిపారు.

  ఆర్టీసీ సమ్మె కేసుపై హైకోర్టు తీర్పు వచ్చింది. సమ్మె చట్టవిరుద్ధమని తాము చెప్పలేమని తెలిపింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను రెండు వారాల్లోగా లేబర్ కోర్టుకు రిఫర్ చెయ్యాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరైతే చక్కటి ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించింది. కోర్టు తుది తీర్పు కాపీ మాకు అందలేదు. తీర్పు కాపీ వచ్చాక దానిపై విశ్లేషించుకొని రేపు (మంగళవారం) సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తాం.
  అశ్వత్థామరెడ్డి


  కోర్టు తీర్పును గౌరవించి.. ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య ఉన్న సంబంధాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని చెప్పారు అశ్వత్థామరెడ్డి. ఐతే డిపోల దగ్గర కార్మికుల నిరసన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. ఇవాళ ఉదయం యూనియన్ల కేంద్ర కమిటీ మీటింగ్ నిర్వహించి... తర్వాత హైకోర్టు తీర్పుపై చర్చిస్తారు. నేటి సాయంత్రం సమ్మె విరమించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

   

  Pics : ఈ బెంగాలీ రసగుల్ల అందాల్ని చూసి తీరాల్సిందే
  ఇవి కూడా చదవండి :

  ఒక్కటవుతున్న రాహుల్, పునర్నవి... ఎక్కడో తెలుసా?

  బిన్ లాడెన్ ఏనుగు మృతి... ఎవరు చంపారు?

  సియాచిన్‌లో మంచు తుఫాను... ఆరుగురు సైనికులు మృతి

  గన్ ఫైరింగ్‌లో ముగ్గురు మృతి... నెటిజన్ల ఫైర్...

  Health : కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు