ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. రేపు సమ్మె విరమిస్తారా..?

మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని.. అంతేకాదు సమ్మె విషయంలో రేపు సాయంత్ర తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: November 18, 2019, 7:26 PM IST
ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. రేపు సమ్మె విరమిస్తారా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉస్మానియా ఆస్పత్రిలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి దీక్ష విరమించారు. వైద్యుల సూచన మేరకు విపక్ష నేతలు, ఆర్టీసీ జేఏసీ కార్మికులు వారితో దీక్ష విరమింపజేశారు. ఈ సంద్భంగా అశ్వత్థామ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని.. అంతేకాదు సమ్మె విషయంలో రేపు సాయంత్ర తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేని.. ఆ తీర్పుపై ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చించి సమ్మెపై ప్రకటన చేస్తామని వెల్లడించారు.

ఆర్టీసీ సమ్మె కేసుపై హైకోర్టు తీర్పు వచ్చింది. సమ్మె చట్టవిరుద్ధమని తాము చెప్పలేమని తెలిపింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను రెండు వారాల్లోగా లేబర్ కోర్టుకు రెఫర్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరైతే చక్కటి ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించింది. కోర్టు తుది తీర్పు కాపీ మాకు అందలేదు. తీర్పు కాపీ వచ్చాక దానిపై విశ్లేషించుకొని రేపు సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తాం.
అశ్వత్థామరెడ్డి


కోర్టు తీర్పును గౌరవించి.. ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య ఉన్న సంబంధాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని చెప్పారు అశ్వత్థామరెడ్డి. ఐతే డిపోల దగ్గర కార్మికుల నిరసన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. మంగళవారం ఉదయం యూనియన్ల కేంద్ర కమిటీ మీటింగ్ నిర్వహించి... అనంతరం హైకోర్టు తీర్పుపై చర్చిస్తామని తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై లేబర్ కోర్టులో తేల్చుకోవాలని చెప్పడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సడక్‌ బంద్ వాయిదా వేశారని.. రేపు సాయంత్రం సమ్మె కూడా విరమించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: November 18, 2019, 7:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading