హోమ్ /వార్తలు /తెలంగాణ /

సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ఆ నిర్ణయంతో ఆర్టీసీకి భారీ లాభాలు..?

సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ఆ నిర్ణయంతో ఆర్టీసీకి భారీ లాభాలు..?

TSRTC Cargo Services : కార్గో రవాణాకు ‘రెడ్ బస్ కలర్’ పేరుగా నామకరణం చేసింది ఆర్టీసీ యాజమాన్యం. జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

TSRTC Cargo Services : కార్గో రవాణాకు ‘రెడ్ బస్ కలర్’ పేరుగా నామకరణం చేసింది ఆర్టీసీ యాజమాన్యం. జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

TSRTC Cargo Services : కార్గో రవాణాకు ‘రెడ్ బస్ కలర్’ పేరుగా నామకరణం చేసింది ఆర్టీసీ యాజమాన్యం. జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

  టీఎస్ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు సంకల్పించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా భారీ సంస్కరణలు చేపట్టారు. 52 రోజుల పాటు సమ్మె చేసినా కార్మికులను కనికరించి వారిని ఉద్యోగులుగా మార్చారు. అంతేకాదు.. పలు వరాలను ప్రకటించారు కూడా. సమ్మె కాలంలో ఆత్మహత్యకు పాల్పడిన కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు సర్కారు తీసుకుంటున్న కొత్త నిర్ణయం బాగానే కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రవాణా వ్యవస్థలో కార్గో సేవలు(సరుకు రవాణా) తక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించి భారతీయ తపాలా శాఖ సేవలు అందిస్తున్నా.. కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో కార్గో సేవలను అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల లాభాలను గడించవచ్చని ఆయన భావిస్తున్నారు. సింగరేణి తరహాలో ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించగా.. ఆ దిశగా కార్గో సేవలు పేరుతో కొత్త దారులు తెరిచారు. ఈ మేరకు.. కార్గో రవాణాకు ‘రెడ్ బస్ కలర్’ పేరుగా నామకరణం చేసింది ఆర్టీసీ యాజమాన్యం. జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

  కాగా, గురువారం ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మతో కలసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సంస్థ ఎగ్జిక్యూటివ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సూచనల మేరకు ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, అందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని మంత్రి ఈడీలకు సూచించారు. కార్గో మోడల్ బస్‌ ఈ నెల 23 నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.

  ఇక.. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు బస్సుల్లో ప్రయాణించాలని తానే స్వయంగా లేఖలు రాసినట్లు పువ్వాడ తెలిపారు. అటు.. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరిగే మేడారం జాతరకు అన్ని డిపోల నుంచి బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

  First published:

  Tags: Rtc, Telangana, Telangana News, Tsrtc

  ఉత్తమ కథలు