తెలంగాణ ఆర్టీసీ సమ్మె యధాతథం...లేబర్ కోర్టు తేల్చే వరకూ ఆందోళన కొనసాగింపు..

డిమాండ్లు నెరవేరకుండా సమ్మెవిరమిస్తే ప్రభుత్వం మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదోనని కార్మికులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అయితే మెజారిటీ కార్మికులు మాత్రం లేబర్ కోర్టు తేల్చే వరకు సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 19, 2019, 7:16 PM IST
తెలంగాణ ఆర్టీసీ సమ్మె యధాతథం...లేబర్ కోర్టు తేల్చే వరకూ ఆందోళన కొనసాగింపు..
అశ్వత్థామరెడ్డి
  • Share this:
తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‌లో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు. అయితే సమ్మె కొనసాగింపుపై కార్మికులు భిన్న అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. కొంతమంది కార్మికులు సమ్మె విరమిస్తే తమకు ఉద్యోగ భద్రతపై ప్రశ్నిస్తున్నారు. డిమాండ్లు నెరవేరకుండా సమ్మెవిరమిస్తే ప్రభుత్వం మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదోనని కార్మికులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అయితే మెజారిటీ కార్మికులు మాత్రం లేబర్ కోర్టు తేల్చే వరకు సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కార్మికుల అభిప్రాయాన్ని బ్యాలెట్ ద్వారా తీసుకోవాలని జేఏసీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>