సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు.. గవర్నర్ తమిళిసైను కలిసిన ఆర్టీసీ జేఏసీ

కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్‌కు చెప్పారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కలగజేసుకోవాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: October 21, 2019, 5:59 PM IST
సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు.. గవర్నర్ తమిళిసైను కలిసిన ఆర్టీసీ జేఏసీ
గవర్నర్ తమిళిసై, ఆర్టీసీ ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 18వ రోజు కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వం, అటు ఆర్టీసీ జేఏసీ.. ఇరువురూ పంతం వీడకపోడంతో సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసైను కలిశారు. సమ్మె జరుగుతున్న తీరు, హైకోర్టు వ్యాఖ్యలను తమిళసైకి వివరించారు. కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు స్పష్టంచేసినా.. ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు జేఏసీ నేతలు. కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్‌కు చెప్పారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కలగజేసుకోవాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు.

First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading