బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా...హోం మంత్రి మహమూద్ అలీ ఫైర్...

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా...హోం మంత్రి మహమూద్ అలీ ఫైర్...

మహమూద్ అలీ

సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆర్టీసీకి గతంలో ఎవరూ ఇవ్వని విధంగా 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంతో విలీనం చేయలేదని ఆయన తెలిపారు.

  • Share this:
    ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికుల డిమాండ్ సరైంది కాదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆర్టీసీకి గతంలో ఎవరూ ఇవ్వని విధంగా 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంతో విలీనం చేయలేదని ఆయన తెలిపారు. కాగా, ప్రభుత్వం పదేపదే చెప్పినా వినకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని మంత్రి సత్యవతి రాథోడ్ ఈ సందర్భంగా అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో విపక్షాలు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆమె అన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు సీఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. ఆర్టీసీ నాయకుల వ్యవహార శైలితో సంస్థ మరింత నష్టాల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా చెెప్పలేదని స్పష్టం చేశారు.
    First published: