హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC Strike | ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు సీరియస్...

TSRTC Strike | ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు సీరియస్...

అటు ఆర్టీసీ కార్మికులకు క్లాస్ పీకిన న్యాయస్థానం.. ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫు వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

  తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు ఆర్టీసీ కార్మికులకు క్లాస్ పీకిన న్యాయస్థానం.. ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫు వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్‌ను హాజరుకావాలని ఆదేశించింది. ‘ఈ వాదనలు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టుకు మధ్య జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ మాత్రమే వాదనలు వినిపించాలి. ఆర్టికల్ 226లో మా అధికారాలు ఏం ఉన్నాయో అడిషనల్ అడ్వొకేట్ జనరల్ గుర్తు చేయొద్దు.’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలతో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. దీంతోపాటు ప్రభుత్వం చర్యల మీద కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రభుత్వ చర్యలు చుస్తుంటే ప్రభుత్వం ఒకటి డిసైడ్ అయిపోయినట్టు ఉంది. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి చర్చలకు వచ్చినట్టు ఉంది. మీకు చర్చలు జరపాలాన ఉద్దశం ఉందా?’ అని హైకోర్టు ప్రశ్నించింది.

  తెలంగాణ రాష్ట్రంలో రైళ్లలో కంటే బస్సుల్లోనే ప్రయాణికులు ఎక్కువగా జర్నీ చేస్తుంటారని హైకోర్టు అభిప్రాయపడింది. ‘అదిలాబాద్ అడవి ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు ఆరోగ్య సమస్య ఉంటే వారు వరంగల్, హైదరాబాద్ లకు రావాలంటే బస్ లు తిరగకుండా ఉంటే ప్రభుత్వం ఆ చిన్నారి చావుకు బాధ్యత తీసుకుంటుందా..’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. అసలే డెంగ్యూ జ్వరాలతో ప్రాణాలు పోతున్నాయని, రూ.46 కోట్లు లేవని చెప్పి ప్రభుత్వం చిన్నారి చావుకి కారణం అవుతుందని అభిప్రాయపడింది.

  ఈ పిటిషన్ విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. అయితే, రెండు రోజులు గడువు కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరినప్పటికీ.. కోర్టు అంగీకరించలేదు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

  అయ్యయ్యో.. టపాసులు కాలుస్తుంటే.. కారు ఢీకొట్టేసింది...

  First published:

  Tags: Rtc jac, RTC Strike, Telangana, Telangana High Court, TSRTC Strike

  ఉత్తమ కథలు