హోమ్ /వార్తలు /తెలంగాణ /

‘కేసీఆర్ తాతా.. స్కూల్ మూసేస్తే మా చదువు సాగేదెట్లా?’

‘కేసీఆర్ తాతా.. స్కూల్ మూసేస్తే మా చదువు సాగేదెట్లా?’

‘కేసీఆర్ తాతా మా బ‌డులు మూస్తే చ‌దువులు సాగేదేట్లా..? ఆర్టీసీ స‌మ్మెను ప‌రిష్క‌రించండి.. బ‌డులు తెరిపించండి’ అనే ఫ్లెక్సీ పట్టుకుని నిర‌స‌న ర్యాలీలో పాల్గొన్నారు.

  తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసి కార్మిక లోకం చేపట్టిన సమ్మె నిజామాబాద్ జిల్లాలో ఉధృతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికుల‌ డిమాండ్ల సాధనలో భాగంగా వివిధ పద్ధతుల్లో కార్మికులు నిరసన‌లు తెలియజేస్తున్నారు. నగరంలో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ, బీజేపీ మ‌ద్ద‌తుతో ఈ రోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డిపో 2 నుంచి ధర్నా చౌక్ వరకు బైక్ ర్యాలీ సాగింది. కార్మికులకు మ‌ద్ద‌తుగా బాల బృందం ‘కేసీఆర్ తాతా మా బ‌డులు మూస్తే చ‌దువులు సాగేదేట్లా..? ఆర్టీసీ స‌మ్మెను ప‌రిష్క‌రించండి.. బ‌డులు తెరిపించండి’ అనే ఫ్లెక్సీ పట్టుకుని నిర‌స‌న ర్యాలీలో పాల్గొన్నారు. మ‌రో వైపు కార్మికులు రేప‌టి తెలంగాణ బంద్ కు ప్ర‌జ‌లు అందరు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. గత 14 రోజులుగా తాము అనేక రూపాలలో ఆందోళన కార్యక్రమాలను చేస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ చర్చలకు పిలువకుండా తమను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ దిగివచ్చే వరకు తమ డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

  సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు తెలంగాణలో దసరా సెలవులు ప్రకటించారు. అయితే, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో దసరా సెలవులను అక్టోబర్ 19 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 21న స్కూళ్లు మళ్లీ తెరుస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాలల యాజమాన్యాలు సందేశాలు పంపుతున్నాయి.

  మరోవైపు శనివారం ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. ఆర్టీసీ యాజమాన్యంతో తాము చర్చలకు సిద్ధమేనని యూనియన్లు కోర్టుకు తెలిపాయి. దీంతో వారితో చర్చలు జరపాల్సిందేనని యాజమాన్యానికి కోర్టు స్పష్టం చేసింది. మూడు రోజుల్లో చర్చలు పూర్తి చేయాలని ఆదేశించింది.

  First published:

  Tags: CM KCR, Nizamabad, Rtc jac, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు